Share News

పోలీసుల ముందే పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. వీడియో వైరల్

ABN , Publish Date - Jun 17 , 2026 | 01:05 PM

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విచారణ సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

పోలీసుల ముందే పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. వీడియో వైరల్
Madhya Pradesh News

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ఎస్పీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విచారణ సందర్భంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళల మధ్య మొదట తీవ్ర వాగ్వాదం ప్రారంభమైంది. అనంతరం ఒకరినొకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ, కాళ్లతో తన్నుకుంటూ, జుట్టు పట్టుకుని లాక్కుంటూ నేలపై పడి పోలీసుల సమక్షంలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


పోలీస్ అధికారుల సమాచారం ప్రకారం.. ప్రజా విచారణలో భాగంగా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ఒక మహిళ కార్యాలయానికి వచ్చింది. అక్కడ విద్యా రైక్వార్‌ అనే మరో మహిళ తనకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తోందని, ఆమెకు నేరస్థులతో సంబంధాలు ఉన్నాయని బాధితురాలు ఆరోపించింది. తాను ఒక యూట్యూబర్‌నని చెప్పుకొనే విద్యా రైక్వార్.. కొన్ని రోజుల క్రితం బాధితురాలికి వ్యతిరేకంగా వాస్తవాలను వక్రీకరిస్తూ ఒక వీడియో కథనాన్ని ప్రచురించినట్లు తెలిసింది. ఆ తప్పుడు కథనంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు ఎస్పీని ఆశ్రయించడంతో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అసలు గొడవకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

జపాన్ జనాల పద్ధతే వేరు.. ప్రపంచం ఫిదా

ఒక బాయ్‌ఫ్రెండ్‌గా నాకు కొన్ని బాధ్యతలు తప్పవు.. జస్టిన్ ట్రూడో

Updated Date - Jun 17 , 2026 | 01:39 PM