రెచ్చిపోయిన దొంగలు.. ఏటీఎమ్ మాయం
ABN , Publish Date - Jun 17 , 2026 | 10:36 AM
అనంతపురం జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎమ్ మిషన్‌నే ఎత్తుకెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. బుక్కరాయసముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అనంతపురం, జూన్ 17: జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. ఏకంగా ఏటీఎమ్ మిషన్‌నే ఎత్తుకెళ్లడం తీవ్ర కలకలం రేపుతోంది. బుక్కరాయసముద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈరోజు(బుధవారం) తెల్లవారుజామున బుక్కరాయసముద్రంలో ఎస్‌బీఐ ఏటీఎమ్ మిషన్ ఉన్న గది అద్దాలను దుండగులు రాడ్లతో ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎమ్ మిషన్‌తో పాటు బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎత్తుకెళ్లిన ఏటీఎమ్‌ను శింగనమల మండలం ఆకులోడు దగ్గర దొంగలు పడేసినట్లు పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా ఏటీఎమ్‌పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌తో అక్కడి పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అలాగే ఏటీఎమ్‌ను పడేసి వెళ్లిన ఆకులోడు వద్ద కూడా ఆధారాల కోసం పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వంద మీటర్ల దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం స్థానికంగా సంచలనం రేపుతోంది.
ఇవి కూడా చదవండి...
దుర్గమ్మ సన్నిధిలో అక్షరాభ్యాస మహోత్సవం.. తరలివచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులు
Read Latest AP News And Telugu News