దుర్గమ్మ సన్నిధిలో అక్షరాభ్యాస మహోత్సవం.. తరలివచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులు
ABN , Publish Date - Jun 17 , 2026 | 09:51 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నిజ జేష్ఠ తదియ సందర్భంగా ఈ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు.
విజయవాడ, జూన్ 17: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నిజ జేష్ఠ తదియ సందర్భంగా ఈ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు(బుధవారం) ఉదయం 6 గంటలకే మహా మండపం 6వ అంతస్తుకు భారీ ఎత్తున ఐదు సంవత్సరాలలోపు చిన్నారులు, వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే ప్రవేశాన్ని కల్పిస్తున్నారు. చిన్నారితో పాటు తల్లిదండ్రులకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
ఉదయం 8:06 గంటలకు శుభ ముహూర్తంలో అక్షరాభ్యాసం ప్రారంభమైంది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవోపేతంగా అక్షరాభ్యాస కార్యక్రమం మొదలైంది. పలక, బలపం, పూజా సామాగ్రిని ఆలయ అధికారులు ఉచితంగా అందజేస్తున్నారు. అక్షరాభ్యాసం అనంతరం అమ్మవారి దర్శనం, ప్రసాదాలు ఉచితంగా ఇవ్వనున్నారు. సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం సందర్భంగా సమయపాలన పాటించాలని భక్తులకు ఈవో శీనా నాయక్ విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి...
ఉద్ధవ్ ఠాక్రేకు మరో షాక్? ఢిల్లీలో స్పీకర్‌ను కలవనున్న ఆరుగురు ‘UBT’ ఎంపీలు!
Read Latest AP News And Telugu News