పాకిస్థాన్‌లో థియేటర్లు ఇలా ఉంటాయా! నెటిజన్ల షాకింగ్ రియాక్షన్..
ABN , Publish Date - Jun 17 , 2026 | 07:22 AM
సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని ఒక పల్లెటూరికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పాకిస్థాన్‌లో థియేటర్లు ఇలా ఉంటాయా.. అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. సాధారణంగా మనం ఎన్నో అధునాతన సౌకర్యాలు, పెద్ద పెద్ద స్క్రీన్లు, అదిరిపోయే సౌండ్ సిస్టమ్‌లతో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్లను సినిమాలు చూస్తుంటాం. కాగా, దాయాది దేశమైన పాకిస్థాన్‌లోని ఒక పల్లెటూరికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. పాకిస్థాన్‌లో థియేటర్లు ఇలా ఉంటాయా.. అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి పాకిస్థాన్ గ్రామీణ ప్రాంతంలోని ఒక థియేటర్‌ను చూపిస్తాడు. అయితే దాన్ని థియేటర్ అనడం కంటే ఒక చిన్న గది లేదా దుకాణం అనవచ్చు. ఎందుకంటే ఆ చిన్న గదిలో కేవలం ఒక 32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ అమర్చి ఉంది. ప్రేక్షకులు కూర్చోవడానికి ఎలాంటి కుర్చీలు, సోఫాలు ఉండవు. కేవలం కొన్ని చెక్క బల్లలు మాత్రమే ఉన్నాయి. గది పైన ఒక పాత ఫ్యాన్ తిరుగుతూ కనిపిస్తుంది. అక్కడ సినిమా చూస్తూ రూ. 30 పెట్టి టీ తాగవచ్చని ఆ వీడియోలో చెబుతారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పాకిస్థాన్‌లో థియేటర్లు ఇలా ఉంటాయా.. అంటూ కొందరు, ఇలాంటి థియేటర్లు నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
జపాన్ జనాల పద్ధతే వేరు.. ప్రపంచం ఫిదా
ఒక బాయ్‌ఫ్రెండ్‌గా నాకు కొన్ని బాధ్యతలు తప్పవు.. జస్టిన్ ట్రూడో