శభాష్ శ్రీలలిత!
ABN , Publish Date - Jun 17 , 2026 | 06:14 AM
విజయవాడకు చెందిన యువగాయని శ్రీలలితపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసల వర్షం కురిపించారు.
సంగీతంలో మరిన్ని విజయాలు సాధించాలి
కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంస
విజయవాడ, జూన్ 16(ఆంధ్రజ్యోతి): విజయవాడకు చెందిన యువగాయని శ్రీలలితపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసల వర్షం కురిపించారు. రెండు విభిన్న సంగీత ప్రక్రియలు కర్ణాటక, హిందుస్తానీలలో రాణిస్తున్న ఆమెకు అభినందనలు తెలిపారు. మంగళవారం శ్రీలలిత నివాసానికి వెళ్లిన కేంద్రమంత్రి...ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల సుపరిపాలన, సాధించిన విజయాలపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆమెకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ...గతంలో ప్రధాని మోదీ స్వయంగా శ్రీలలిత ప్రతిభను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశంసించారని గుర్తుచేశారు. శ్రీలలిత సంగీతంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు.