బీచ్ ఒడ్డున జాగ్రత్తగా ఉండకపోతే ఇంతే.. ప్రమాదం ఎలా ముంచుకొచ్చిందో చూడండి..
ABN , Publish Date - Jun 18 , 2026 | 07:23 AM
సముద్రపు అలల ఉధృతి ఎంత ప్రాణాంతకంగా మారుతుందో కళ్లకు కట్టేలా ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. సముద్రపు అలల శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ఘటనే ఒక నిదర్శనమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో తాము ఎప్పటికీ నీటిలోకి దిగే సాహసం చేయలేమని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు సముద్రం ఒడ్డున భారీ అలల మధ్య ఈత కొడుతున్నాడు. అయితే అలల ఉధృతి ఎక్కువగా ఉన్నాకూడా అజాగ్రత్తగా వ్యవహరిస్తూ నీటిలోకి దూకే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో భారీ అల రావడంతో ఆ వ్యక్తి నీటిలోకి కొట్టుకుపోయాడు. అయితే వెంటనే అప్రమత్తమైన అక్కడి వారు అతన్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. ఈ ఘటనను కొందరు వీడియో వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ వీడియో చూసిన తర్వాత సముద్ర తీరాలలో భద్రతా నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. పైకి సముద్రం ఎంత ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ, లోపల ఉండే నీటి ప్రవాహాలు, అకస్మాత్తుగా ఎగిసిపడే అలలు ఎంత ప్రాణాంతకంగా మారతాయో ఈ ఘటన అందరికీ గుర్తుచేస్తోంది. మెక్సికోలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన 'కాబో శాన్ లూకాస్' సముద్ర తీరంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అక్కడి బలమైన, ప్రమాదకరమైన అలల మధ్య ఒక పర్యాటకుడు చిక్కుకుపోయిన ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి కూడా చదవండి
తెలంగాణలో సంక్షేమం లేదు.. ఎక్కడ చూసినా కూల్చివేతలే: కేటీఆర్
బెంగాల్ బ్లాక్‌బస్టర్ షో.. అన్‌సంగ్ హీరో మిథున్ చక్రవర్తి