ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు.. అమెరికా ప్రకటన..
ABN , Publish Date - May 16 , 2026 | 04:38 PM
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగించారు. వాషింగ్టన్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.
ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 45 రోజుల పాటు పొడిగించారు. వాషింగ్టన్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఇరు దేశాల మధ్య సమావేశానికి అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. ఇరు దేశాల మధ్య ఏప్రిల్ 16న ప్రారంభమైన తాత్కాలిక కాల్పుల విరమణ ఈ ఆదివారంతో ముగియాల్సి ఉంది. దీంతో మరో 45 రోజుల పాటు ఈ ఒప్పందాన్ని పొడిగారు (Israel Lebanon ceasefire).
ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న సమయంలో శాశ్వత శాంతి ఒప్పందం కోసం మరిన్ని చర్చలు కొనసాగనున్నాయి. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య సరిహద్దు భద్రత, శాంతి, పరస్పర సార్వభౌమాధికారం కోసం చర్చలు కొనసాగుతాయని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి టామీ పిగాట్ తెలిపారు. మే 29న పెంటగాన్‌లో సైనిక స్థాయి చర్చలు, జూన్ 2-3 తేదీల్లో రాజకీయ స్థాయి చర్చలు జరగనున్నాయని వెల్లడించారు (US mediated ceasefire).
కాగా, కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ దక్షిణ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి (Hezbollah news). శనివారం సివిల్ డిఫెన్స్ కేంద్రంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఆరుగురు మరణించినట్టు సమాచారం. 22 మంది గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేం: ట్రంప్
పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్