పాక్ తీరు మారకుంటే.. చరిత్రలో కలిసిపోతుంది: భారత ఆర్మీ చీఫ్
ABN , Publish Date - May 16 , 2026 | 02:23 PM
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై దాడులు కొనసాగిస్తే ప్రపంచపటంలో పాకిస్థాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. భౌగోళికంగా ఉండాలా లేక చరిత్రలో కలిసిపోవాలా అనేది పాకిస్థాన్ తేల్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్‌పై దాడులు కొనసాగిస్తే ప్రపంచపటంలో పాకిస్థాన్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. భౌగోళికంగా ఉండాలా లేక చరిత్రలో కలిసిపోవాలా అనేది పాకిస్థాన్ తేల్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. భారత్‌పై దాడులు చేసే ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం ఆపాలని ఆయన పాక్‌ను హెచ్చరించారు (Indian Army Chief warning to Pakistan).
దేశ భద్రత విషయంలో భారత్ ఎలాంటి రాజీకీ వెళ్లదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని, అందరిపై కఠిన చర్యలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు. అలాగే గతేడాది పహల్గాం దాడికి ప్రతిస్పందనగా నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' గురించి కూడా ద్వివేది మాట్లాడారు (Pakistan terrorism support).
'పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాల ఉనికిని 'ఆపరేషన్ సిందూర్' ద్వారా ప్రపంచానికి తెలియజేశాం. ఉగ్ర స్థావరాలకు సంబంధించిన ఆధారాలు అందజేశాం (Operation Sindoor). పాకిస్థాన్ ఇప్పటికైనా తన తీరు మార్చుకోవాలి. ఆపరేషన్ సిందూర్ రెండో వెర్షన్ మరింత తీవ్ర స్థాయిలో ఉంటుంది. భారత ప్రభుత్వం ఎప్పుడూ దేశ పౌరుల రక్షణ, శ్రేయస్సు విషయంలో రాజీ పడదు. తన మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే దీటుగా స్పందిస్తుంది' అని ద్వివేది తేల్చి చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
మరో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు ఖతం.. ట్రంప్ ప్రకటన
ఇరాన్‌పై మరోసారి దాడులు? ట్రంప్ నిర్ణయంపై ఉత్కంఠ