Share News

చైనాను నమ్మని యూఎస్ అధికారులు! గిఫ్టులన్నీ చెత్తబుట్టలో..

ABN , Publish Date - May 16 , 2026 | 12:48 PM

పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో యూఎస్ అధికారులు చైనాలో ఇచ్చిన గిఫ్టులు ఇతర వస్తువులను అక్కడే వదిలివెళ్లినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

చైనాను నమ్మని యూఎస్ అధికారులు! గిఫ్టులన్నీ చెత్తబుట్టలో..
Trump security concerns in China

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, చైనాల మధ్య అపనమ్మకం ఏ స్థాయిలో ఉందో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా పర్యటనలో మరోసారి వెలుగులోకి వచ్చింది. చైనా పర్యటన అనంతరం అమెరికా అధికారులు చైనా వారు ఇచ్చిన వస్తువలన్నీ అక్కడి చెత్తబుట్టల్లోనే పడేసి వెనుదిరిగినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ట్రంప్ వెంట వచ్చిన అధికారులు, విలేకరులు తిరిగి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఎక్కే సమయంలో చైనా వస్తువులు, బహుమతులు, ఐడీ కార్డులు వంటివాటిని అక్కడి చెత్తబుట్టల్లో పడేశాకే విమానం ఎక్కారు.

ఈ పర్యటన సందర్భంగా అమెరికా అధికారులు, పత్రికా విలేకరులకు చైనా భద్రతా అధికారులు బర్నర్ ఫోన్లు, ఐడీ బ్యాడ్జీలు, లేపుల్ పిన్స్ వంటివాటిని ఇచ్చారు. వీటన్నిటినీ సిబ్బంది తిరిగి వెళ్లేటప్పుడు అక్కడి చెత్తబుట్టల్లో పారేశారని యూఎస్ జర్నలిస్టుల్లో ఒకరు తెలిపారు. ‘చైనా వారు ఇచ్చిన ఏ ఫోన్‌ను ఎయిర్‌ఫోర్స్ వన్‌లోకి అనుమతించలేదు’ అని సదరు జర్నలిస్టు పేర్కొన్నారు. ఈ విషయంలో విమానం బయలుదేరే ముందే అన్ని రకాల జాగ్రత్తలను అమెరికా అధికారులు తీసుకున్నారు.


ఇక చైనా పర్యటనకు ముందు సిబ్బంది ఎవరూ తమ వ్యక్తిగత ఫోన్‌లను వెంట తీసుకెళ్లలేదు. సెక్యూరిటీ విషయంలో ఎలాంటి సమస్యా రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిన బర్నర్ ఫోన్‌లను తీసుకెళ్లారు. చైనా నిఘాపై అనేక అనుమానాలు ఉన్న యూఎస్ ప్రభుత్వం అధ్యక్షుడి తాజా పర్యటనలో కూడా ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని అనిపించేలా ట్రంప్, జిన్‌పింగ్‌లు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ భద్రతా ఏర్పాట్లు మొదలు విలేకరులకు అనుమతుల వరకూ ఇరు వర్గాల మధ్య ఈ టూర్‌లో అభిప్రాయభేదాలు తలెత్తినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఈ వార్తలనూ చదవండి:

మరో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు ఖతం.. ట్రంప్ ప్రకటన

ఇరాన్‌పై మరోసారి దాడులు? ట్రంప్ నిర్ణయంపై ఉత్కంఠ

Updated Date - May 16 , 2026 | 01:17 PM