Share News

తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేం: ట్రంప్

ABN , Publish Date - May 16 , 2026 | 02:48 PM

తైవాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. తైవాన్ స్వాతంత్ర్యం కోసం చైనాతో పోరాడడం కుదరదని తేల్చి చెప్పేశారు. ఇటీవల చైనా పర్యటన ముగించుకుని తిరిగి అమెరికా చేరుకున్న ట్రంప్ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు.

తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయలేం: ట్రంప్
Trump Taiwan comments

తైవాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. తైవాన్ స్వాతంత్ర్యం కోసం చైనాతో పోరాడడం కుదరదని తేల్చి చెప్పేశారు. ఇటీవల చైనా పర్యటన ముగించుకుని తిరిగి అమెరికా చేరుకున్న ట్రంప్ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. తైవాన్‌కు చైనా కేవలం 95 కిలో మీటర్ల దూరంలో ఉందని, అమెరికా 15 వేల కి.మీ. దూరంలో ఉందని వ్యాఖ్యానించారు (Trump Taiwan comments).


'ఉద్రిక్తతల విషయంలో చైనా, తైవాన్ సంయమనం పాటించాలి. తైవాన్‌కు అమెరికా చాలా దూరంలో ఉంది. ఏదైనా జరిగితే మేం వేగంగా స్పందించడం కష్టమే. పైగా, చైనా చాలా శక్తిమంతమైన, పెద్ద దేశం. తైవాన్ కోసం చైనాతో యుద్ధం చేయాలనుకోవడం లేదు' అని ట్రంప్ తేల్చి చెప్పారు. అలాగే తైవాన్‌కు ఇవ్వాల్సిన 14 బిలియన్ డాలర్ల ఆయుధాల ప్యాకేజీపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ట్రంప్ తెలిపారు (US China Taiwan issue).


తైవాన్‌ను తనలో పూర్తిగా విలీనం చేసుకోవాలని చైనా ఎప్పట్నుంచో ప్రయత్నిస్తోంది (Xi Jinping Taiwan tensions). ఆ ప్రయత్నాలను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ట్రంప్ కూడా చైనా తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే తాజా పర్యటన తర్వాత ట్రంప్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కాగా, అమెరికా-చైనా సంబంధాల్లో తైవాన్ అత్యంత కీలక అంశమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తనతో అన్నారని ట్రంప్ వెల్లడించారు. 'మేము రాత్రంతా తైవాన్ గురించే మాట్లాడాం' అని తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:

మరో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు ఖతం.. ట్రంప్ ప్రకటన

ఇరాన్‌పై మరోసారి దాడులు? ట్రంప్ నిర్ణయంపై ఉత్కంఠ

Updated Date - May 16 , 2026 | 02:52 PM