లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ఐదుగురి మృతి..
ABN , Publish Date - May 09 , 2026 | 10:49 AM
పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో కనీసం ఐదుగురు మరణించినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా హెజ్‌బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్ వైపు రాకెట్లు ప్రయోగించింది.
పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ నిర్వహించిన వైమానిక దాడుల్లో కనీసం ఐదుగురు మరణించినట్లు సమాచారం. దీనికి ప్రతిస్పందనగా హెజ్‌బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్ వైపు రాకెట్లు ప్రయోగించింది. దీంతో మరోసారి పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి (Israel Lebanon conflict).
లెబనాన్‌లోని టౌరా ప్రాంతంలోని పలు గ్రామాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. టౌరా గ్రామంలో జరిగిన దాడిలో మహిళలు సహా పలువురు మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు కఫర్ చౌబా ప్రాంతంలో అంబులెన్స్ సిబ్బందిపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. దక్షిణ లెబనాన్‌లోని కొన్ని గ్రామాల ప్రజలను ముందుగానే ఖాళీ చేయాలని హెచ్చరించిన తర్వాతే ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగింది (Israeli airstrikes Lebanon).
హెజ్‌బొల్లా కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడికి ప్రతి స్పందనగా హెజ్‌బొల్లా కూడా దాడులకు దిగింది (Hezbollah rockets). ఉత్తర ఇజ్రాయెల్‌లోని సైనిక స్థావరాలపై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేపట్టింది. ఆ రాకెట్లలో ఎక్కువ శాతం బహిరంగా ప్రదేశాల్లో పడడంతో పెద్దగా నష్టం జరగలేదని ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఇద్దరు సైనికులు గాయపడినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..