Share News

రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..

ABN , Publish Date - May 09 , 2026 | 07:23 AM

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడు రోజుల కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..
Russia Ukraine ceasefire

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడు రోజుల కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు (Trump Russia Ukraine ceasefire).


తన అభ్యర్థన మేరకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ఈ నిర్ణయం తీసుకున్నారని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సుదీర్ఘంగా సాగుతున్న ఈ యుద్ధం ముగింపునకు ఇది ఆరంభం అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. శని, ఆది, సోమవారాల్లో ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి కాల్పులూ ఉండవని ట్రంప్ ప్రకటించారు. అలాగే వెయ్యి మంది చొప్పున యుద్ధ ఖైదీలను ఇరు దేశాలు పరస్పరం బదిలీ చేసుకుంటాయని తెలిపారు (Russia Ukraine war latest news).


'రష్యాలో శనివారం నాడు విక్టరీ డేను జరుపుకుంటారు (Donald Trump ceasefire announcement,). రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలపై విజయానికి ప్రతీకగా రష్యా ఈ విక్టరీ డేను నిర్వహిస్తుంది. అలాగే ఉక్రెయిన్ కూడా ఈ విక్టరీ డేను సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇరు దేశాల అధినేతలు మూడు రోజుల కాల్పుల విరమణకు అంగీకరించారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్నాయి. అవి సత్ఫలితాలను ఇవ్చొచ్చు' అని ట్రంప్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం

Updated Date - May 09 , 2026 | 08:46 AM