కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం
ABN , Publish Date - May 08 , 2026 | 05:06 PM
కేరళంలో కాంగ్రెస్ సారథ్యంలో యూడీఎఫ్ కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎంపికకు కసరత్తు జరుగుతోంది. ఈ రేసులో లోక్‌సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ ముందున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్‌లు తమ నివేదికను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించినట్టు పార్టీ వర్గాలు శుక్రవారంనాడు తెలిపాయి.
న్యూఢిల్లీ: కేరళంలో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎంపికకు కసరత్తు జరుగుతోంది. ఈ రేసులో లోక్‌సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ముందున్నారని తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్‌లు తమ నివేదికను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు సమర్పించినట్టు పార్టీ వర్గాలు శుక్రవారంనాడు తెలిపాయి. పార్టీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు, కూటమి భాగస్వాములు, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని పార్టీ తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
సీఎం అభ్యర్థుల రేసులో కేసీ వేణుగోపాల్‌తో పాటు గత అసెంబ్లీలో విపక్ష నేత వీడి సతీశన్, వెటన్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాల పోటీ పడ్డారు. అయితే పార్టీ అధిష్టానానికి అత్యంత విశ్వసనీయుడిగా పేరున్న 63 ఏళ్ల కేసీ వేణుగోపాల్ ముందు వరుసలో ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనను తదుపరి సీఎంగా అధిష్టానం ప్రకటిస్తే ఎంపీ స్థానానికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది.
కాగా, కాంగ్రెస్ కార్యకర్తలు బహిరంగంగానే వేణుగోపాల్ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. యూడీఎఫ్ విజయానికి నిజమైన వ్యూహకర్త ఆయనేనని, ఆయనను నాయకన్, హీరో అని చిత్రీకరిస్తూ పార్టీ కార్యాలయం వెలుపల పోస్టర్లు కూడా వెలిసాయి.
ఇవి కూడా చదవండి..
తమిళనాడులో విజయ్‌కు లైన్ క్లియర్.. సంఖ్యా బలం రెడీ..
బెంగాల్‌లో చారిత్రక ఘట్టం.. రేపే సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం