Share News

బెంగాల్‌లో చారిత్రక ఘట్టం.. రేపే సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - May 08 , 2026 | 04:59 PM

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టనున్నారు. కోల్‌కతాలోని బిశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

బెంగాల్‌లో చారిత్రక ఘట్టం.. రేపే సీఎంగా  సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
Suvendu Adhikari to Become West Bengal’s First BJP Chief Minister

కోల్‌కతా, మే 8: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం మొదలైంది. రాష్ట్రంలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పగ్గాలు చేపట్టనున్నారు. ఇవాళ (శుక్రవారం) కోల్‌కతాలోని బిశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో సువేందు అధికారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం

రేపు మే 9, 2026 (శనివారం) ఉదయం 11:00 గంటలకు కోల్‌కతాలోని చరిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.

ఇద్దరు డిప్యూటీ సీఎంలు?

పాలనలో సమతుల్యత కోసం ఇద్దరు ఉపముఖ్యమంత్రులను నియమించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ ఒక డిప్యూటీ సీఎం పదవిని మహిళా నేతకు (బహుశా అగ్నిమిత్ర పాల్) కేటాయించే అవకాశం ఉంది. ప్రాంతీయ సమీకరణలు దృష్టిలో పెట్టుకుని ఉత్తర బెంగాల్, గిరిజన ప్రాంతాలకు కేబినెట్‌లో పెద్దపీట వేయనున్నారని సమచారం.

Suvendhu-Adhikari-Amit-Shah.jpg


విజయ్‌లాగే సువేందు కూడా..

తమిళనాడులో విజయ్ లాగే సువేందు అధికారి కూడా ఈ ఎన్నికల్లో రెండు చోట్ల (భవానీపూర్, నందిగ్రామ్) పోటీ చేసి రెండింటిలోనూ ఘనవిజయం సాధించారు. ముఖ్యంగా భవానీపూర్‌లో మమతా బెనర్జీపై 15,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి 'జెయింట్ కిల్లర్'గా నిలిచారు. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ 207 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని సాధించింది. టీఎంసీ 80 స్థానాలకే పరిమితమైంది. రేపు ఉదయం జరగనున్న ఈ కార్యక్రమం ద్వారా బెంగాల్ గడ్డపై కమల దళం అధికారికంగా పాలనను ప్రారంభించనుంది.


ఇవి కూడా చదవండి..

ఏపీ ECET - 2026 ఫలితాల విడుదల

రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2026 | 05:33 PM