ఏపీ ECET - 2026 ఫలితాల విడుదల
ABN , Publish Date - May 08 , 2026 | 02:15 PM
ఏపీ ECET- 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు(శుక్రవారం) విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఈసెట్ పరీక్షకు 32,434 మంది అభ్యర్థులు హాజరవగా.. 29,750 మంది అర్హత సాధించారు.
అమరావతి, మే 8: ఏపీ ECET- 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు(శుక్రవారం) విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేశారు. ఈసెట్ పరీక్షకు 32,434 మంది అభ్యర్థులు హాజరవగా.. 29,750 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణత శాతం 91.72గా నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి(APSCHE) తరఫున జేఎన్‌టీయూ అనంతపురం ఏప్రిల్ 23న ఈసెట్ పరీక్షను నిర్వహించింది. ర్యాంక్ కార్డులను వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా అభ్యర్థులు సులభంగా చూసుకోవచ్చని మంత్రి లోకేశ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డ్
Read Latest AP News And Telugu News