ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డ్
ABN , Publish Date - May 08 , 2026 | 01:24 PM
కలెక్టర్ల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ సమయాన్ని 5 గంటల నుంచి 2 గంటల 49 నిమిషాలకు తగ్గించడం ద్వారా అచ్చెన్నాయుడు రికార్డు సాధించారు.
అమరావతి, మే 8: ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. గంటల వ్యవధిలోనే భారీ సంఖ్యలో ఫైళ్లను పరిష్కరించడం ద్వారా పరిపాలనలో వేగం, పారదర్శకతకు కొత్త ప్రమాణాలు నిర్దేశించారు. కలెక్టర్ల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ సమయాన్ని 5 గంటల నుంచి 2 గంటల 49 నిమిషాలకు తగ్గించడం ద్వారా అచ్చెన్నాయుడు రికార్డు సాధించారు. భారీగా ఫైళ్లు వచ్చినా వేగవంతంగా డిస్పోజ్ చేస్తున్నారు మంత్రి.
ప్రజలకు త్వరితగతిన సేవలు అందించడమే తన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఈ-గవర్నెన్సు అమలులో వ్యవసాయ శాఖ ముందంజలో ఉందని అధికారులు తెలిపారు. మంత్రి నాయకత్వంలో వ్యవసాయ శాఖ సాధిస్తున్న పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌ను రోజుల నుంచి గంటల వ్యవధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వ యంత్రాంగంలో ఈ-ఫైళ్ల క్లియరెన్స్ వ్యవస్థ చురుకుదనాన్ని పెంచుతోంది. మంత్రి అచ్చెన్నాయుడు ఫైళ్ల క్లియరెన్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
నకిలీ విత్తనాలతో మోసం.. తీవ్ర నష్టాల్లో రైతులు
రాయలసీమకు దూసుకొస్తున్న ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’: ఎక్స్‌లో సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News