ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం.. మంత్రులు, అధికారులకు సీఎం అభినందనలు
ABN , Publish Date - May 08 , 2026 | 11:13 AM
ఈ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడంపై సీఎం చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగంగా ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
అమరావతి, మే 8: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు కొనసాగుతోంది. ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ వంటి అంశాలపై సమీక్షించనున్నారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్ రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి రావడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగంగా ఉన్న మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు, సెక్రటరీలకు సీఎం అభినందనలు తెలిపారు. పెద్దమొత్తంలో ఫైళ్లు వచ్చినా సరాసరి 10 గంటల వ్యవధిలో ఫైళ్లను డిస్పోజ్ చేసిన సీఎస్ సాయి ప్రసాద్‌ను ముఖ్యమంత్రి అభినందించారు.
ఫైళ్ల క్లియరెన్స్‌లో వెనుకబడిన పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లకు వేగం పెంచాలని సూచనలు చేశారు. గత మూడు నెలలతో పోల్చుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఫైళ్ల క్లియరెన్స్ సమయం 10 రోజుల నుంచి రెండు రోజులకు తగ్గిందని ఈ సందర్భంగా సీఎంకు ఐటీ సెక్రటరీ తెలియజేశారు. కలెక్టర్ల సదస్సుల్లో స్వయంగా సీఎం పర్యవేక్షణతో ఫైళ్ల డిస్పోజ్‌లలో స్పష్టమైన మార్పు కనిపించింది.
ఫైళ్ల క్లియరెన్స్ అతి ముఖ్యమైన అంశం: సీఎం
ఫైళ్లను త్వరగా క్లియర్ చేస్తే ప్రభుత్వ సేవలు మరింత త్వరగా అందుతాయన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సులో ఫైళ్ల క్లియరెన్స్ అనేది అతి ముఖ్యమైన అంశంగా చెప్పుకొచ్చారు. సీఎస్, సెక్రటరీలు, హెచ్‌వోడీలు మొదలుకుని.. మండల స్థాయి వరకు ఫైళ్ల క్లియరెన్సులో వేగం పెరగాలని సూచించారు. మ్యానువల్ ఫైళ్లనేవి దాదాపు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాలనకు టెక్నాలజీని అనుసంధానించడంతో పాటు.. హ్యూమన్ టచ్ కూడా ముఖ్యమని తెలిపారు. 24 గంటల్లోపు ఈ-ఫైల్స్ డిస్పోజ్ చేసేలా మంత్రులు, అధికారులు శ్రద్ధ పెట్టాలన్నారు.
ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో అందరి పనితీరును ఎప్పటికప్పుడు నమోదు చేస్తూనే ఉన్నామని సీఎం తెలిపారు. జిల్లాల్లో ఈ-ఆఫీస్ ద్వారా లేని ఫైల్స్ ఎన్ని ఉన్నాయో గుర్తించాలని ఆదేశించారు. జిల్లా స్థాయిలో, హెచ్‌వోడీలు తప్పనిసరిగా ఈ-ఫైల్స్ మాత్రమే జనరేట్ చేయాలన్నారు. ప్రజలకు సేవలందించే విషయంలో వినూత్న ఆలోచనలతో పాటు మరింత మెరుగైన పాలనకు కలెక్టర్లు వినూత్నంగా ఆలోచించాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచనలు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఇబ్బందులున్నా ప్రాణహిత ప్రాజెక్ట్‌ను నిర్మించి తీరుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
యువకుడి దారుణ హత్య.. యువతి ఇంటి ముందు ఆందోళన.. ఉద్రిక్తం
Read Latest AP News And Telugu News