Home » Chief Minister
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన పరమేశ్వర గత నెలలో తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెప్పారు. దళిత సామాజిక వర్గానికి చెందిన నేతను సీఎం చేయాలని కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక వర్గం డిమాండ్ చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అంశంపై తమ వాదనను ఉధృతం చేస్తూ న్యూఢిల్లీలో ఆదివారంనాడు మెగా ర్యాలీ నిర్వహించింది. ఓటింగ్ ప్రక్రియను తారుమారు చేసేందుకు బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను బీజేపీ, ఈసీ ఖండించాయి.
లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2023లో ఇండియా కూటమి కోసం నితీశ్ చేసిన ప్రయత్నాలను ఒమర్ ప్రస్తావించారు. నితీశ్‌ను ఇండియా కూటమి కన్వీనర్‌గా చేసే విషయమై తాము అప్పట్లో జరిగిన సమావేశంలో చర్చించామన్నారు.
జమ్మూకశ్మీర్‌లో రిజిస్టర్ అయిన కారుతో ఢిల్లీకి వెళ్తే అది కూడా ప్రస్తుతం నేరంగా పరిగణిస్తున్నారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.
పేలుడులో గాయపడి లోక్‌నాయక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం రేఖాగుప్తా మంగళవారంనాడు పరామర్శించారు. వారికి అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు.
బెళగావి జిల్లాలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో యతీంద్ర మాట్లాడుతూ, తన తండ్రి రాజకీయ కెరీర్ చివరి దశలో ఉందన్నారు. ఈ పరిస్థితిలో బలమైన, ప్రగతిశీల భావజాలం ఉన్న నాయకుడు కావాలని, ఆయనకు సిద్ధరామయ్య మార్గదర్శిగా ఉంటారని చెప్పారు.
తాను మాట్లాడిన మాటలు వివాదాస్పదమైనట్టు తెలియగానే వివరణ ఇచ్చానని యతీంద్ర చెప్పారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై పార్టీలోనే మాట్లాడతానని, మీడియా ముందు మాట్లాడనని అన్నారు.
గుజరాత్ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్ కేబినెట్‌లోని మంత్రులంతా ఇవాళ(గురువారం) రాజీనామా చేశారు. మరికాసేపట్లో గవర్నర్‌ను సీఎం భూపేంద్ర పటేల్ కలవనున్నారు.
తమిళనాడు మూడు ప్రధాన ప్రకృతి వైపరీత్యాలను చవిచూసిందని, ఏ సందర్భంలోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి రావడం కానీ, నిధులు ఇవ్వడం కానీ చేయలేదని స్టాలిన్ విమర్శించారు. ఇప్పుడు మాత్రం కరూర్‌కు ఆఘమేఘాల మీద వచ్చారని మండిపడ్డారు.
కేజ్రీవాల్ పోస్ట్‌ను బీజేపీ వెంటనే తప్పుపట్టింది. ఎడిట్ చేసిన వీడియోతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమంటూ మండిపడింది. రేఖా గుప్తా ఇంటర్వ్యూ పూర్తి వీడియోను కూడా విడుదల చేసింది.