Siddaramaiah: సీఎం కుర్చీ కోసం ఎలాంటి ఫైట్ లేదు.. సిద్ధరామయ్య
ABN , Publish Date - Jan 11 , 2026 | 09:51 PM
విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లుపై గవర్నర్‌ను బీజేపీ కలవాలని అనుకుంటున్నట్టు వస్తున్న సమాచారంపై సిద్ధరామయ్య మాట్లాడుతూ, ఈ బిల్లును గవర్నర్ తోసిపుచ్చలేదని చెప్పారు.
బెంగళూరు: కర్ణాటకలోని అధికార కాంగ్రెస్‌లో అధికారం కోసం కుమ్ములాట జరుగుతోందంటూ వస్తున్న ఊహాగానాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి సీటు కోసం ఎలాంటి ఘర్షణలు జరగడం లేదన్నారు.
సంక్రాంతి తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి సీటు కోసం ఫైట్ జరుగనుందంటూ బీజేపీ సోషల్ మీడియా పోస్టుపై మీడియా ప్రశ్నించినప్పుడు 'ఫైట్ ఎక్కడ? అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారు. అలాంటి ప్రసక్తే లేదు. ఇదంతా మీడియా సృష్టే' అని సిద్ధరామయ్య మండిపడ్డారు.
విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లుపై గవర్నర్‌ను బీజేపీ కలవాలని అనుకుంటున్నట్టు వస్తున్న సమాచారంపై మాట్లాడుతూ, ఈ బిల్లును గవర్నర్ తోసిపుచ్చలేదని చెప్పారు. బిల్లుకు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం లభించిందని, గవర్నర్ బిల్లును ఆమోదించడం కానీ వెనక్కి తిప్పిపంపడం కానీ చేయొచ్చని అన్నారు. గవర్నర్ పిలిస్తే మాత్రం తాము వివరణ ఇస్తామని చెప్పారు. బళ్లారి అల్లర్ల ఘటనను ఖండిస్తూ బీజేపీ పాదయాత్ర చేపట్టనుండటంపై అడిగినప్పుడు, చేసుకుంటే చేసుకోవచ్చని, ఎవరు చేయవద్దని అంటారని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
వడ్డీలేని రుణాలు, బస్సుల్లో మహిళలకు రాయితీలు...మహాయుతి మేనిఫెస్టో
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దిశగా భారత్.. వైబ్రంట్ గుజరాత్ సదస్సులో మోదీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి