BMC Polls: వడ్డీలేని రుణాలు, బస్సుల్లో మహిళలకు రాయితీలు...మహాయుతి మేనిఫెస్టో
ABN , Publish Date - Jan 11 , 2026 | 08:10 PM
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే తదితరులు మహాయుతి వచన్ నామాను విడుదల చేశారు.
ముంబై: బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు ఆకర్షణీయమైన ఎన్నికల హామీలతో దూసుకుపోతున్నాయి. తాజాగా బీఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను మహాయుతి కూటమి (Mahayuti alliance) ఆదివారంనాడు విడుదల చేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే తదితరులు 'మహాయుతి వచన్ నామా' (MayaYuti Vachan Nama)ను విడుదల చేశారు.
బీఎంసీతో సహా మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పోలింగ్ ఈనెల 15న జరుగనుంది. 16న ఫలితాలు ప్రకటిస్తారు.
మహాయుతి కీలక హామీలివే..
-వచ్చే ఐదేళ్లలో నీటి పన్నుల పెంపు నిలిపివేత.
-గర్గాయి, పింజల్, దమన్‌గంగా ప్రాజెక్టులను రాబోయే ఐదేళ్లలో పూర్తి చేసి ముంబైకి నీటి సరఫరాను పెంచడం.
-చిన్నతరహా పరిశ్రమ విధానాన్ని అమలు చేయడం.
-శిథిలమైన భవనాల పునరుద్ధరణ సహా రీవలప్‌మెంట్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం.
-BEST బస్సులన్నింటినీ 2029 నాటికి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం.
-'బెస్ట్' బస్సులలో మహిళా ప్రయాణికులకు 50 శాతం రాయితీ
-'బెస్ట్' బస్సులను 5000 నుంచి 10,000 బస్సులకు పెంచడం.
-లడ్కీ బహిన్ లబ్ధిదారుల స్వయం సమృద్ధి, చిన్న తరహా వ్యాపారాలకు రూ.5 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు.
-రోహింగ్యా, బంగ్లా అక్రమ వలసదారుల నుంచి ముంబైకి విముక్తి
-పర్యావరణ పరిరక్షణ పథకాల కింద రూ.17,000 కోట్లు కేటాయింపు
-పర్యాటకాన్ని ప్రమోట్ చేసేందుకు టూరిజం శాఖ ఏర్పాటు
-బాలాసాహెబ్ ఠాక్రే శత జయంతి సందర్భంగా మరాఠీ యువతకు ప్రత్యేక కార్యక్రమాలు, ఆర్థిక చేయూత
-బీఎంసీ మార్కెట్లలో చేపలు అమ్మేవారికి కోసం కోల్ట్ స్టోరేజ్‌ల నిర్మాణం
-అన్ని కూరగాయల మార్కెట్ల పునరుద్ధరణ
-చేపల దిగుమతులు, ఎగుమతుల కేంద్రాల ఏర్పాటు
-స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రాలు నెలకొల్పడం
-మున్సిపల్ కార్పొరేషన్ స్వతంత్రంగా మరాఠా భాషా శాఖ ఏర్పాటు
-మరాఠీ ఆర్ట్ సెంటర్లు, స్టడీ లైబ్రరీలు ఏర్పాటు చేయడం
-2024 నాటికి అభివృద్ధి చెందిన ముంబై లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయడం
ఇవి కూడా చదవండి..
ఆ శక్తులు ఇప్పటికీ చురుగ్గానే ఉన్నాయి.. ప్రధాని మోదీ
సోమనాథ్ శౌర్యయాత్రలో ప్రధాని.. కాన్వాయ్ వెంట 108 అశ్వాలు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి