Share News

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సహాయం.. ధ్రువీకరించిన డ్రాగన్ మీడియా..

ABN , Publish Date - May 09 , 2026 | 09:34 AM

పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరుతో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సహాయం.. ధ్రువీకరించిన డ్రాగన్ మీడియా..
China Pakistan support

పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరుతో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది. ఆ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సాంకేతిక సహాయం అందించిందట. ఈ విషయాన్ని తాజాగా చైనా మీడియా ధ్రువీకరించింది (China Pakistan support).


పాక్‌కు క్షేత్రస్థాయిలో సాంకేతిక సహకారం అందించినట్టు చైనా తొలిసారి బహిరంగంగా అంగీకరించింది. ఏవియేషన్‌ ఇండస్ట్రీ కార్పొరేషన్‌ ఆఫ్‌ చైనా (ఏవీఐసీ)కి చెందిన చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్‌ డిజైన్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇంజినీర్ జాంగ్ హెంగ్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూను ప్రభుత్వ వార్తా సంస్థ అయిన 'సీసీటీవీ' ప్రసారం చేసింది. గతేడాది నాలుగు రోజుల పాటు భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో తాము పాకిస్థాన్‌ అధికారులతో కలిసి పనిచేసినట్టు జాంగ్‌ అంగీకరించారు (China admits support to Pakistan).


చైనా తయారు చేసిన జే-10సీ యుద్ధ విమానాలను పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వినియోగిస్తోంది (India China relations). 'ఆపరేషన్ సిందూర్' సమయంలో జాంగ్ నేతృత్వంలోని ఇంజినీర్ల బృందం పాక్‌కు సాంకేతిక సహాయం అందించింది. ఆ యుద్ధంలో తాను క్షేత్ర స్థాయిలో పని చేశానని, శారీరకంగా, మానసికంగా ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని జాంగ్ వెల్లడించారు. కాగా, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చేసిన క్షేత్ర స్థాయి సహాయం గురించి అడిగిన ప్రశ్నలకు అప్పట్లో చైనా విదేశాంగ, రక్షణ శాఖలు సమాధానాలు ఇవ్వలేదు.


ఇవి కూడా చదవండి..

రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..


స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - May 09 , 2026 | 11:23 AM