విజయ్‌కు మద్దతుగా సంతకం పెట్టిన ఎమ్మెల్యే కామరాజ్.. వీడియో విడుదల చేసిన టీవీకే..
ABN , Publish Date - May 09 , 2026 | 08:26 AM
తమిళనాడు రాజకీయాలు ఓ సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. మక్కల్ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే మన్నార్గుడి కామరాజ్‌కు సంబంధించిన ఓ సంచలన వీడియోను టీవీకే పార్టీ తాజాగా విడుదల చేసింది.
తమిళనాడు రాజకీయాలు ఓ సస్పెన్స్ సినిమాను తలపిస్తున్నాయి. మక్కల్ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే మన్నార్గుడి కామరాజ్‌కు సంబంధించిన ఓ సంచలన వీడియోను టీవీకే పార్టీ తాజాగా విడుదల చేసింది. విజయ్ సీఎం కావడానికి కామరాజ్ స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతూ లేఖపై సంతకం పెట్టిన ఘటనకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది (AMMK MLA Kamaraj Video).
'ఏఎమ్‌ఎమ్‌కే ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా, ఆనందంగా టీవీకేకు మద్దతు తెలుపుతూ లేఖ రాశారు. అంతేకాకుండా ఆ లేఖను టీటీవీ దినకరన్ అనుమతితోనే అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు' అని టీవీకే పేర్కొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్జీ రాకపోవడంతో ఫలితాలు వెలువడి ఐదు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కుదరడం లేదు. పలు చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు టీవీకే ప్రయత్నిస్తోంది. ఏఎమ్‌ఎమ్‌కే తరఫున నెగ్గిన ఎమ్మెల్యే అయిన కామరాజ్ తమకు మద్దతుగా ఉన్నారని గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో టీవీకే పేర్కొంది (TVK support controversy).
కాగా, గవర్నర్‌కు విజయ్ అందజేసిన మద్దతు లేఖలో ఏఎమ్‌ఎమ్‌కే ఎమ్మెల్యే అయిన కామరాజ్ పేరు ఉండడపై ఆ పార్టీ అధినేత దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ( Tamil Nadu political updates). మన్నార్గుడి ఎమ్మెల్యే కామరాజ్ అందుబాటులో లేరని, ఆయనను అపహరించి ఉండొచ్చని ఆయన ఆరోపించారు. అర్ధరాత్రి గవర్నర్‌ను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు. అనంతరం కామరాజ్ స్పందిస్తూ.. తాను అన్నాడీఎంకేకు మాత్రమే మద్దతు ఇస్తానని, విజయ్ టీవీకే పార్టీకి ఇవ్వనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ తాజాగా ఈ వీడియోను విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి..
రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్..
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..