స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - May 09 , 2026 | 06:36 AM
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెద్దగా హెచ్చు తగ్గులకు గురి కాకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1.5 లక్షలకు దగ్గర్లోనే ఉంటోంది. శనివారం ఉదయం బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెద్దగా హెచ్చు తగ్గులకు గురి కాకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1.5 లక్షలకు దగ్గర్లోనే ఉంటోంది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది (Gold and Silver Rates).
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,670గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,39,940గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,870గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,090గా ఉంది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర పెరుగుదల నమోదు చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,74,800గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,75,100గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,74,800గా, బెంగళూరులో రూ.2,75,100గా ఉంది.
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.
ఇవి కూడా చదవండి...
పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం
కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం