Share News

ఆ ఇద్దరి వల్లే ఈ విజయం: రియాన్ పరాగ్

ABN , Publish Date - Apr 29 , 2026 | 08:52 AM

శుభమ్ దూబే, డోనోవన్ ఫెర్రీరా అద్భుత బ్యాటింగ్‌తోనే విజయం సాధించామని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ అన్నాడు. ఈ ఇద్దరూ అసాధారణ ప్రదర్శనతో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నామని వెల్లడించాడు.

ఆ ఇద్దరి వల్లే ఈ విజయం: రియాన్ పరాగ్
Riyan Parag

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్‌ 2026లో భాగంగా ముల్లాన్‌పుర్‌ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్‌ 19.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ అనంతరం ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. శుభమ్ దూబే, డోనోవన్ ఫెర్రీరా అద్భుత బ్యాటింగ్‌తోనే విజయం సాధించామని అన్నాడు.


'శుభమ్ దూబే, ఫెర్రీరా అసాధారణ ప్రదర్శనతో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేశారు. అయితే ఈ టోర్నీ ప్రారంభానికి ముందు ఒక జట్టుగా మేం ఏ విషయాల గురించి చర్చించుకున్నామో.. అవన్నీ ఈ మ్యాచ్‌లో అమలు చేశాం. ప్రత్యర్థిని మరికొన్ని తక్కువ పరుగులకే కట్టడి చేయాల్సింది. మా బౌలర్లు ఎంత శ్రమించిన పంజాబ్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. అయితే మా బౌలర్ల లోటును మా బ్యాటర్లు పూడ్చారు' అని తెలిపాడు.


'బౌలింగ్‌, బ్యాటింగ్‌లో ఇంకొన్ని ఓవర్లు మెరుగ్గా ఆడి ఉండాల్సింది. ఏది ఏమైనప్పటికీ.. 40 ఓవర్ల పాటు అత్యుత్తమ ప్రదర్శన చేయాలనే లక్ష్యంతోనే మేం బరిలోకి దిగుతాం. బయట వారికి మాత్రమే ఆందోళనలు ఉంటాయి. మా ఆటగాళ్లపై మాకు పూర్తి నమ్మకం ఉంది. వికెట్లు కాపాడుకుంటూనే రన్ రేట్ తగ్గకుండా చూసుకోవడమే మా ప్రణాళిక. మధ్యలో కొంచెం వెనుకబడినప్పటికీ.. తిరిగి పుంజుకున్నాం. శుభమ్ దూబే, ఫెర్రీరాల బ్యాటింగ్ విధానం నిజంగా ప్రశంసనీయం' అని రియాన్ పరాగ్ వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

పీఎస్‌ఎల్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు నెలకొల్పిన బాబర్

పంజాబ్‌కు తొలి ఝలక్‌

Updated Date - Apr 29 , 2026 | 09:22 AM