Share News

బెంగళూరులో శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ABN , Publish Date - Apr 29 , 2026 | 09:41 AM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి(Pudi Srihari) అరెస్ట్ అయ్యారు. శ్రీహరిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు కుప్పంకు తరలిస్తున్నారు.

బెంగళూరులో శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Pudi Srihari

విజయవాడ, ఏప్రిల్ 29: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్‌వో పూడి శ్రీహరి(Pudi Srihari) అరెస్ట్ అయ్యారు. శ్రీహరిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న పోలీసులు కుప్పంకు తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టిన పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అంశంపై కుప్పం పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జిగా ఉన్న శ్రీహరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈనెల 15న శ్రీహరిని విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకుని 16న కుప్పం కోర్టులో హాజరుపరిచారు. కుప్పం కోర్టు శ్రీహరిని రిమాండ్‌కు పంపించేందుకు తిరస్కరించింది. కుప్పం కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై పూడి శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని శ్రీహరి తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే శ్రీహరికి బెయిల్ ఇచ్చేందుకు, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు తిరస్కరించడంతో పాటు.. ఏపీ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే పూడి శ్రీహరిని పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి కుప్పంకు తరలిస్తున్నారని సమాచారం.


ఇవి కూడా చదవండి...

అమెరికా పాస్‌పోర్ట్‌లపై ట్రంప్ ఫొటో.. ధ్రువీకరించిన విదేశాంగ శాఖ..

బెంగాల్‌లో తుది దశ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజకవర్గం పైనే అందరి దృష్టి..

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 29 , 2026 | 09:52 AM