అమెరికా పాస్‌పోర్ట్‌లపై ట్రంప్ ఫొటో.. ధ్రువీకరించిన విదేశాంగ శాఖ..
ABN , Publish Date - Apr 29 , 2026 | 08:50 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అమెరికా పాస్‌పోర్ట్‌లలో తన ఫోటోను ముద్రించాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. అయితే ఈ పాస్‌పోర్ట్‌లను పరిమిత సంఖ్యలోనే ముద్రించనున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అమెరికా పాస్‌పోర్ట్‌లలో ట్రంప్ ఫోటోను ముద్రించాలని నిర్ణయించడం సంచలనంగా మారింది. అయితే ఈ పాస్‌పోర్ట్‌లను పరిమిత సంఖ్యలోనే ముద్రించనున్నారు. అమెరికా 250వ స్వాతంత్ర్య వేడుకలకు గుర్తుగా వీటిని జారీ చేయబోతున్నారు (Trump passport news).
ట్రంప్ ఫొటోతో అమెరికా పాస్‌పోర్ట్‌లను ముద్రించబోతున్నట్టు మొదట మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ వార్తలను అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ పాస్ట్‌పోర్ట్‌లలో ట్రంప్ ఫోటోతో పాటు అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు సంబంధించిన చిత్రాలు, జెండా రూపకల్పన వంటి అంశాలు కూడా ఉంటాయి. కాగా, ఈ పాస్‌పోర్ట్‌లకు ఎలాంటి అదనపు రుసుమునూ వసూలు చేయబోమని విదేశాంగ శాఖ ప్రకటించింది (US passports Trump image).
సాధారణంగా, జీవించి ఉన్న నాయకుల చిత్రాలను అధికారిక పాస్‌పోర్ట్‌లలో ఉపయోగించడం అమెరికాలో అరుదైన విషయం (America250 passports). అందుకే ఈ నిర్ణయం సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా.. 250వ స్వాతంత్ర్య వేడుకలకు గుర్తుగా ట్రంప్ సంతకం ఉన్న కరెన్సీ నోట్లను విడుదల చేయబోతున్నట్టు అమెరికా ట్రెజరీ శాఖ ప్రకటించింది. ఆ దేశ కరెన్సీ నోట్లపై సంతకం చేయబోతున్న తొలి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ నిర్ణయాలపై అమెరికాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చలు జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..