తెలంగాణ పదో తరగతి ఫలితాలు నేడే
ABN , Publish Date - Apr 29 , 2026 | 05:59 AM
పదోతరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్‌సీఈఆర్టీ ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు వీటిని విడుదల చేయనున్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఎస్‌సీఈఆర్టీ ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు వీటిని విడుదల చేయనున్నారు. వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని.. ఇందుకోసం 8096958096 నంబరుకు మధ్యాహ్నం 2:30 నుంచి వాట్సాప్‌లో హాయ్ అంటూ సందేశం పంపాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసారి పదోతరగతి పరీక్షలను మార్చి-14 నుంచి ఈనెల 16వరకు సుదీర్ఘంగా నిర్వహించారు. గతంలో పరీక్షలన్నీ వరుసగా నిర్వహించగా.. ఈసారి విద్యార్థులపై ఒత్తిడి తొలగించేందుకు ప్రతి పరీక్షకు మధ్య 3-4 రోజుల విరామం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు 5.28 లక్షల మంది హాజరయ్యారు.