సూచీలకు భారీ లాభాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ABN , Publish Date - Apr 29 , 2026 | 10:28 AM
ఆటోమొబైల్, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, రియాల్టీ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను లాభాల బాటలో నడిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ లాభాల బాటలో సాగుతుండడం పాజిటివ్‌గా మారాయి.
ఆటోమొబైల్, ఐటీ, ఎఫ్‌ఎమ్‌సీజీ, రియాల్టీ రంగాల్లో కొనుగోళ్లు సూచీలను లాభాల బాటలో నడిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, ప్రధాన ఆసియా మార్కెట్లన్నీ లాభాల బాటలో సాగుతుండడం పాజిటివ్‌గా మారాయి. మరోవైపు నాలుగో త్రైమాసికంలో కంపెనీలు వెల్లడిస్తున్న ఫలితాలు కూడా సానుకూలంగా ఉండడం కలిసొస్తోంది. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. (Indian stock market).
గత సెషన్ ముగింపు (76,886)తో పోల్చుకుంటే బుధవారం ఉదయం దాదాపు 350 పాయింట్ల లాభంతో 77,245 వద్ద మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి దూసుకెళ్లింది. ఉదయం 10:15 గంటల సమయంలో సెన్సెక్స్ 916 పాయింట్ల లాభంతో 77,802 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 275 పాయింట్ల లాభంతో 24,271 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో బంధన్ బ్యాంక్, వొడాఫోన్ ఐడియా, ఆర్బీఎల్ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఏబీ క్యాపిటల్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఆర్‌ఈసీ, పవర్ ఫైనాన్స్, జిందాల్ స్టీల్, నాల్కో, బ్లూస్టార్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 505 పాయింట్ల లాభంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 471 పాయింట్ల లాభంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 94.74గా ఉంది.
ఇవి కూడా చదవండి..
పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 8 మంది మృతి..