Share News

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..

ABN , Publish Date - Apr 30 , 2026 | 06:19 AM

అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, డాలర్ బలపడడం వంటి కారణాలతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గురువారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
gold and silver rates today

అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడం, డాలర్ బలపడడం వంటి కారణాలతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుతుండడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది (Gold and Silver Rates).


గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,430గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,37,890గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,50,580గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,38,040గా ఉంది (Live Gold Rates).


మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి (Silver prices today). కిలోకు వంద రూపాయల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,64,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,54,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.రూ.2,64,900గా, బెంగళూరులో రూ.రూ.2,54,900 ఉంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఈ వార్తలు కూడా చదవండి:

అనంతపురం మీదుగా తిరుపతికి రైలు

రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..

Updated Date - Apr 30 , 2026 | 06:36 AM