పాక్‌లో వంట గ్యాస్ కష్టాలు తీవ్రం
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:32 AM
ఇరాన్‌లో యుద్ధంతో ప్రపంచ దేశాలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది...
కరాచీ, ఏప్రిల్ 29: ఇరాన్‌లో యుద్ధంతో ప్రపంచ దేశాలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ పరిస్థితి తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో.. కరాచీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పైప్‌లైన్ నుంచి వస్తున్న గ్యాస్‌ను ప్రమాదకరంగా ప్లాస్టిక్ బెలూన్లలో నింపుకొని నిల్వ చేసుకుంటున్నారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కరాచీలోని ఒరంగీ టౌన్, మొమినాబాద్, లాంధీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పైప్‌లైన్ ద్వారా గంట సేపు మాత్రమే సరఫరా అయ్యే గ్యాస్ కోసం ఉదయం, రాత్రి వేళల్లో వేచిచూసి.. కంప్రెషర్ల సాయంతో ప్లాస్టిక్ బ్యాగుల్లో ఆ గ్యాస్‌ను నింపుకొని నిల్వ చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని వంటకు వినియోగిస్తున్నారు. అయితే, గ్యాస్‌ను ఇలా నిల్వ చేయడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. గ్యాస్‌తో నిండిన బెలూన్లను వంటగదిలో ఉంచితే ఇంట్లో బాంబులు పెట్టుకున్నట్టేనని హెచ్చరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అనంతపురం మీదుగా తిరుపతికి రైలు
రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..
Read Latest Telangana News and National News