కోహినూర్‌ను భారత్‌కు తిరిగివ్వాలని బ్రిటన్ రాజును కోరుతా: న్యూయార్క్ మేయర్ మమ్దానీ
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:25 AM
కోహినూర్ వజ్రం గురించి అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసే అవకాశం వస్తే, కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతానని తెలిపారు.
కోహినూర్ వజ్రం గురించి అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసే అవకాశం వస్తే, కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇవ్వాలని కోరుతానని తెలిపారు. భారతీయ మూలాలను కలిగిన మమ్దానీ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కింగ్ చార్లెస్-3 ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. న్యూయార్క్‌లోని 9/11 దాడుల స్మారక చిహ్మాన్ని సందర్శించారు (Kohinoor diamond news).
'ఒక కార్యక్రమంలో కాకుండా.. కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడే అవకాశం వస్తే కోహినూర్‌ను భారత్‌కు తిరిగి ఇచ్చెయ్యాలని కోరుతాను' అని బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మమ్దానీ తెలిపారు. ఆ తర్వాత కింగ్ చార్లెస్-3ని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడే అవకాశం మమ్దానీకి వచ్చింది. అయితే ఆయన కోహినూర్ గురించి కింగ్ చార్లెస్-3తో మాట్లాడారా, లేదా అనే విషయం గురించి సమాచారం బయటకు రాలేదు. కాగా, న్యూయార్క్ మేయర్ వ్యాఖ్యలపై స్పందించేందుకు లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నిరాకరించింది (Zohran Mamdani with King Charles).
కాగా, 1849లో మహారాజ్ దులీప్ సింగ్ 108 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని విక్టోరియా మహారాణికి ఇచ్చేశారు (Kohinoor return demand). అప్పట్నుంచి ఆ వజ్రం బ్రిటన్ రాజకుటుంబం ఆధీనంలోనే ఉంది. ఆ వజ్రాన్ని వెనక్కి తీసుకురావాలని భారత ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నిస్తోంది. అయితే అందుకు బ్రిటన్ నుంచి సానుకూల స్పందన రావడం లేదు.
ఇవి కూడా చదవండి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. మరింత తగ్గిన ధరలు..
రష్యాలో మరో ఆయిల్ కేంద్రంపై దాడి.. డ్రోన్ శక్తిని చూపిస్తున్న ఉక్రెయిన్..