Share News

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు: అమిత్ షా

ABN , Publish Date - May 01 , 2026 | 01:00 PM

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బృందం తాజాగా ముంబైలో ఒక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేసినట్టు హోమ్ మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా తెలిపారు.

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు: అమిత్ షా
International Drug Gang Busted in Mumbai

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో డ్రగ్స్ ముఠాలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముంబైలో ఒక అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు చేసిందని తెలిపారు. తాజా ఆపరేషన్‌లో రూ. 1,745 కోట్ల విలువైన 349 కేజీల హైక్వాలిటీ కొకెయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. క్షేత్రస్థాయిలో స్వల్ప మొత్తంలో జరిగిన డ్రగ్స్ రవాణా ఆధారంగా అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు చేసినట్టు తెలిపారు. ఈ చరిత్రాత్మక విజయం సాధించిన ఎన్‌సీబీ బృందానికి హోం మంత్రి అభినందనలు తెలిపారు.


ఈ వార్తనూ చదవండి:

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్

ఎక్సైజ్ సుంకం పెరిగినా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఉండదన్న ఐఓసీ!

Updated Date - May 01 , 2026 | 01:39 PM