Share News

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్

ABN , Publish Date - May 01 , 2026 | 09:55 AM

టీమిండియా మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. పంజాబ్ పోలీసులు తనకు కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవడాన్ని నిరసిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పంజాబ్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టును ఆశ్రయించిన హర్భజన్ సింగ్
Harbhajan Singh Punjab court

పంజాబ్, మే01: టీమిండియా మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ పంజాబ్ హైకోర్టును ఆశ్రయించారు. పంజాబ్ పోలీసులు తనకు కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవడాన్ని నిరసిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఇంటి బయట జరుగుతున్న నిరసనలు, తన కుటుంబ భద్రతపై ఉన్న ఆందోళనలను కారణాలుగా పిటిషన్‌లో పేర్కొన్నారు.


తనకు పంజాబ్ పోలీసు భద్రతను ఎందుకు ఉపసంహరించుకున్నారని రాష్ట్ర అధికారులను ప్రశ్నించిన హర్భజన్, దానిని తక్షణమే పునరుద్ధరించాలని హైకోర్డును అభ్యర్థించారు. తన నివాసం వెలుపల జరిగిన నిరసనల గురించి భజ్జీ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. ఆ నిరసనలలో గోడలపై 'ద్రోహి' అనే పదం రాశారని, అటువంటి సంఘటనలు తనకు, తన కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.


హర్భజన్ పిటిషన్‌పై పంజాబ్ హైకోర్టు స్పందించింది. సదరు ఎంపీ భద్రతను ఉపసంహరించుకోవాలన్న నిర్ణయంపై వివరణ కోరుతూ పంజాబ్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ విషయంపై మే 12న విచారణ జరగనుంది. 9 మంది పోలీసులతో కూడిన పోలీసు భద్రతను పంజాబ్ ప్రభుత్వం ఉపసంహరించిన సంగతి తెలిసిందే. రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా సహా ఐదుగురు ఎంపీలతో పాటు హర్భజన్ కూడా ఇటీవల బీజేపీలో చేరారు.. ఆ తర్వాతనే హర్భజన్‌కు భద్రతను తొలగిస్తూ పంజాబ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీని వదలని నేతలపై ఆప్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు.


ఇవి చదవండి:

జేసన్ హోల్డర్ క్యాచ్ వివాదం.. అంపైర్‌పై కోహ్లీ ఆగ్రహం!

వారి వల్లే ఈ ఓటమి.. రజత్ పాటిదార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - May 01 , 2026 | 11:18 AM