జేసన్ హోల్డర్ క్యాచ్ వివాదం.. అంపైర్‌పై కోహ్లీ ఆగ్రహం!
ABN , Publish Date - May 01 , 2026 | 08:46 AM
ఐపీఎల్ 2026లో నిన్న గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గుజరాత్ ప్లేయర్ జేసన్ హోల్డర్ పట్టిన క్యాచ్ వివాదానికి దారి తీసింది.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో నిన్న(గురువారం) గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గుజరాత్ ప్లేయర్ జేసన్ హోల్డర్ పట్టిన క్యాచ్ వివాదానికి దారి తీసింది. హోల్డర్ పట్టిన ఓ క్యాచ్ అనుమానాస్పదంగా ఉన్నా, థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యాడు.
నిన్న జైపూర్ వేదికగా గుజరాత్, బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు పూర్తి విఫలమయ్యారు. కెప్టెన్ రజత్ పాటిదార్ కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలోనే అతడు ఔటైన తీరు చర్చనీయాంశంగా మారింది. అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో పాటిదార్ కొట్టిన షాట్‌ను బౌండరీ లైన్ దగ్గర ఉన్న జేసన్ హోల్డర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే అతడు క్యాచ్ అందుకున్న తీరు చర్చకు దారి తీసింది. బంతిని పట్టుకున్న మరుక్షణమే నేలను తాకించాడు. అయినప్పటికీ థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో కోహ్లీతో పాటు ఆర్సీబీ ప్లేయర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మైదానంలోనే అంపైర్‌తో కోపంగా చర్చించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విరాట్‌పై చర్యలేమైనా ఉంటాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. అయితే తీవ్రతను బట్టి శిక్ష నిర్ణయిస్తారు. సాధారణంగా ఇలాంటి ఘటనలకు మ్యాచ్ ఫీజులో 25 నుంచి 50 శాతం వరకు జరిమానా, ఓ డీమెరిట్ పాయింట్ కేటాయిస్తారు. నిషేధం విధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇటీవల నితీశ్ రాణా కూడా అంపైర్‌తో వాగ్వాదానికి దిగగా, అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు.
ఇవి చదవండి:
వారి వల్లే ఈ ఓటమి.. రజత్ పాటిదార్ ఆసక్తికర వ్యాఖ్యలు