గుజరాత్ ఘనంగా..
ABN , Publish Date - May 01 , 2026 | 02:30 AM
గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్‌షోతో మురిపించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియంలో ఎదురైన ఓటమికి తమ సొంత మైదానంలో బదులు తీర్చుకుంది....
నేటి మ్యాచ్
రాజస్థాన్ X ఢిల్లీ
వేదిక : జైపూర్ రా.7.30 నుంచి
వణికించిన బౌలర్లు
4 వికెట్ల తేడాతో బెంగళూరుపై విజయం
అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండ్‌షోతో మురిపించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియంలో ఎదురైన ఓటమికి తమ సొంత మైదానంలో బదులు తీర్చుకుంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆర్‌సీబీని బౌలర్లు స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. ఆ తర్వాత గిల్ (18 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 43), బట్లర్ (19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 39)ల దూకుడుకు మరో 25 బంతులుండగానే గుజరాత్ 4 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. దేవ్‌దత్ (24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), విరాట్ (13 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 28) రాణించారు. పేసర్ అర్షద్‌కు మూడు.. రషీద్, హోల్డర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో గుజరాత్ 15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి నెగ్గింది. తెవాటియా (27 నాటౌట్) రాణించాడు. భువనేశ్వర్‌కు మూడు, షెఫర్డ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా హోల్డర్ నిలిచాడు.
గిల్, బట్లర్‌ల దూకుడు
స్వల్ప ఛేదనలో గుజరాత్ వికెట్లు కోల్పోయినా ఆరంభం నుంచే వేగం కనబరిచింది. ముఖ్యంగా ఓపెనర్ గిల్, బట్లర్ బౌండరీలతో ఎదురుదాడికి దిగారు. పేసర్ భువనేశ్వర్ మాత్రం కళ్లు చెదిరే బంతులతో మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ సుదర్శన్ (6) ఈసారి విఫలమైనా.. అటు గిల్ మాత్రం తొలి ఓవర్‌లో 4,6.. రెండో ఓవర్‌లో 4,4,6,4,6తో చెలరేగాడు. అయితే భువీ తన వరుస ఓవర్లలో ఓపెనర్లను పెవిలియన్‌కు చేర్చాడు. అయితే బట్లర్ 4,6తో పవర్‌ప్లేలో జట్టు 69/2తో నిలిచింది. స్పిన్నర్ సుయాష్ ఓవర్‌లో రెండు సిక్సర్లు బాదిన బట్లర్‌ను తిరిగి భువీనే అద్భుత బంతికి బౌల్డ్ చేశాడు. కానీ 9 ఓవర్లలోనే స్కోరు 100 దాటడంతో జీటీకి ఇబ్బందిలేకుండా పోయింది. 11వ ఓవర్‌లో షారుక్ (8), సుందర్ (12)లను పేసర్ షెఫర్డ్ అవుట్ చేసినా.. తెవాటియా, హోల్డర్‌ల ధాటికి లక్ష్యం వేగంగా తగ్గింది. అప్పటికి ఆరు ఓవర్లలో 15 పరుగులే అవసరం కావడంతో ఆర్‌సీబీ చేసేదేమీ లేకపోయింది.

టైటాన్స్ బౌలర్ల కట్టడి
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు బ్యాటింగ్ ఇబ్బందికరంగా సాగింది. గుజరాత్ బౌలర్లు కచ్చితమైన లెంగ్త్‌తో బంతులు విసిరి పరుగులను కట్టడి చేశారు. చివరి ఐదు ఓవర్లలో కేవలం 26 పరుగులే చేయడంతో ఆర్‌సీబీ అతికష్టంగా 150 రన్స్ దాటింది. అయితే రబాడ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ఓపెనర్ విరాట్ వరుసగా ఐదు ఫోర్లతో 21 రన్స్ అందించాడు. మరో ఓపెనర్ బెథెల్ (5)ను పేసర్ సిరాజ్ అవుట్ చేయగా, తర్వాతి ఓవర్‌లోనే విరాట్‌ను రబాడ పెవిలియన్‌కు చేర్చడంతో ఆర్‌సీబీ 35/2 స్కోరుతో నిలిచింది. అయితే దేవ్‌దత్ మాత్రం వచ్చీరాగానే బ్యాట్ ఝుళిపించాడు. ఐదో ఓవర్‌లో 6,4,4తో 14 రన్స్ సమకూర్చాడు. దీంతో పవర్‌ప్లేలో 59/2 స్కోరుతో ఫర్వాలేదనిపించింది. అటు రజత్ (19) చక్కటి టచ్‌లో కనిపించినా.. 8వ ఓవర్‌లో వివాదాస్పదరీతిలో నిష్క్రమించాడు. అర్షద్ ఓవర్‌లో పుల్ షాట్ ఆడగా.. బౌండరీ దగ్గర బంతిని హోల్డర్ అందుకున్నాడు. అయితే తను కిందపడే సమయంలో చేతిని నేలకు అనించినట్టుగా రీప్లేలో కనిపించడంతో ఆర్‌సీబీ అభ్యంతరం వ్యక్తపరిచింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం బంతి కింద అతడి చేతి వేళ్లున్నాయనే అంచనాతో అవుట్‌గా ప్రకటించాడు. మూడో వికెట్‌కు వీరి మధ్య 44 పరుగులు జత చేరాయి. అనంతరం జితేశ్ (1), డేవిడ్ (9), క్రునాల్ (4) వరుస ఓవర్లలో వెనుదిరగడంతో 97 రన్స్‌కే జట్టు 6 వికెట్లు కోల్పోయింది. అటు దేవ్‌దత్, ఫెఫర్డ్ భారీ షాట్లకు వెళ్లడంతో జట్టు కోలుకున్నట్టు కనిపించింది. కానీ ఈ ఇద్దరూ వరుస ఓవర్లలో అవుటవడంతో మళ్లీ తడబడింది. ఇక డెత్ ఓవర్లలో వెంకటేశ్ (12), భువనేశ్వర్ (15 నాటౌట్)లను నియంత్రించడంతో ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యారు. ఆఖరి ఓవర్‌లో చివరి 2 వికెట్లు కోల్పోగా మరో 4 బంతులుండగానే ఆర్‌సీబీ ఈ సీజన్‌లో తొలిసారి ఆలౌటైంది.
స్కోరుబోర్డు
బెంగళూరు: బెథెల్ (సి) రషీద్ (బి) సిరాజ్ 5, విరాట్ (సి) రషీద్ (బి) రబాడ 28, దేవ్‌దత్ (బి) రషీద్ 40, రజత్ (సి) హోల్డర్ (బి) అర్షద్ 19, జితేశ్ (సి) బట్లర్ (బి) హోల్డర్ 1, డేవిడ్ (సి) హోల్డర్ (బి) రషీద్ 9, క్రునాల్ (సి) హోల్డర్ (బి) అర్షద్ 4, షెఫర్డ్ (సి) సుదర్శన్ (బి) హోల్డర్ 17, వెంకటేశ్ (సి) సుదర్శన్ (బి) అర్షద్ 12, భువనేశ్వర్ (నాటౌట్) 15, హాజెల్‌వుడ్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 19.2 ఓవర్లలో 155 ఆలౌట్; వికెట్ల పతనం: 1-34, 2-35, 3-79, 4-80, 5-91, 6-96, 7-126, 8-126, 9-155,10-155; బౌలింగ్: సిరాజ్ 4-0-38-1, రబాడ 4-0-44-1, హోల్డర్ 4-0-29-2, అర్షద్ 3.2-0-22-3, రషీద్ 4-0-19-2.
గుజరాత్: సాయి సుదర్శన్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 6, గిల్ (సి) విరాట్ (బి) భువనేశ్వర్ 43, బట్లర్ (బి) భువనేశ్వర్ 39, సుందర్ (ఎల్బీ) షెఫర్డ్ 12, షారుక్ (సి) హాజెల్‌వుడ్ (బి) షెఫర్డ్ 8, తెవాటియా (నాటౌట్) 27, హోల్డర్ (సి) దేవ్‌దత్ (బి) సుయాష్ 12, రషీద్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 15.5 ఓవర్లలో 158/6. వికెట్ల పతనం: 1-42, 2-57, 3-92, 4-109, 5-111, 6-141; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-28-3, హాజెల్‌వుడ్ 4-0-56-0, సుయాష్ 3.5-0-44-1, షెఫర్డ్ 4-0-30-2.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
పంజాబ్ 8 6 1 1 13 1.043
బెంగళూరు 9 6 3 0 12 1.420
హైదరాబాద్ 9 6 3 0 12 0.832
రాజస్థాన్ 9 6 3 0 12 0.617
గుజరాత్ 9 5 4 0 10 -0.192
చెన్నై 8 3 5 0 6 -0.121
ఢిల్లీ 8 3 5 0 6 -1.060
కోల్‌కతా 8 2 5 1 5 -0.751
ముంబై 8 2 6 0 4 -0.784
లఖ్‌నవూ 8 2 6 0 4 -1.106
ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు
ఇవి కూడా చదవండి:
ముంబై జట్టుకు మద్దతుగా వాంఖడే స్టేడియానికి వినోద్ కాంబ్లీ
రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్! జైలా..ఫైనా?