ముంబై జట్టుకు మద్దతుగా వాంఖడే స్టేడియానికి వినోద్ కాంబ్లీ
ABN , Publish Date - Apr 30 , 2026 | 11:50 AM
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే కాంబ్లీ నిన్న అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. నడవలేనిస్థితిలో ఉండి కూడా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌కు హాజరయ్యారు.
స్పోర్ట్స్ డెస్క్: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే కాంబ్లీ నిన్న అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. నడవలేనిస్థితిలోనూ ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌కు హాజరయ్యారు. ఇద్దరు వ్యక్తుల సాయంతో నడుస్తూ వాంఖడే స్టేడియానికి వచ్చారు కాంబ్లీ. ఆయన వచ్చారనే విషయం తెలిసి అభిమానులు, మీడియా ప్రతినిధులు భారీగా గుమిగూడారు. కాంబ్లీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'మీరు త్వరగా కోలుకోండి సార్' అని అభిమానులు అనడం వీడియోలో వినిపించింది. కాంబ్లీ కూడా అభిమానులను చూసి సంతోషం వ్యక్తం చేశాడు. ఇక కాంబ్లీ పరిస్థితి విషమంగా ఉందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలకు ఈ వీడియో చెక్ పెట్టింది. 'వినోద్ ఆరోగ్యం గురించి ఎవరు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారో నాకు తెలియదు. దేవుడి దయవల్ల ఆయన బాగానే ఉన్నారు' అని గతంలో కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్ తెలిపారు.
ఈ నేపథ్యంలో కాంబ్లీ వాంఖడే స్టేడియానికి రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన సహచరుడు సచిన్ టెండూల్కర్ కోసం, ముంబై జట్టుకు మద్దతుగా ఆయన స్టేడియానికి వచ్చారని క్రికెట్ అభిమానులు అంటున్నారు. కాంబ్లీ 1991 నుంచి 2000 వరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. తన కెరీర్‌లో 17 టెస్టులు, 104 వన్డేలు ఆడారు.
ఇవి కూడా చదవండి:
రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్! జైలా..ఫైనా?
అతడి వల్లే మ్యాచ్ గెలిచాం: ప్యాట్ కమిన్స్