ఛీ.. ఛీ.. ట్రైన్‌లో ప్లేట్లను ఎలా కడుగుతున్నారో చూడండి.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
ABN , Publish Date - May 31 , 2026 | 01:17 PM
మనదేశంలో ఎక్కువ మంది రైలు ప్రయాణాలంటేనే ఇష్టపడతారు. తక్కువ ఛార్జీలతో, సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలంటే రైళ్లను ఆశ్రయించాల్సిందే. అయితే రైలులో దొరికే ఆహార పదార్థాలంటే మాత్రం అందరూ భయపడతారు.
మనదేశంలో ఎక్కువ మంది రైలు ప్రయాణాలంటేనే ఇష్టపడతారు. తక్కువ ఛార్జీలతో, సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలంటే రైళ్లను ఆశ్రయించాల్సిందే. అయితే రైలులో దొరికే ఆహార పదార్థాలంటే మాత్రం అందరూ భయపడతారు. శుభ్రత పాటించరని, నాణ్యత ఉండదని భావిస్తారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు బయటకు వచ్చాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Train Food Hygiene).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి రైలు టాయిలెట్‌లో అపరిశుభ్ర వాతావరణంలో పాత్రలు కడుగుతున్నాడు. ముంబై లోక్‌మాన్య తిలక్-ఎర్నాకుళం దురంతో ఎక్స్‌ప్రెస్ క్యాటరింగ్ సిబ్బంది ఇలా రైలు టాయిలెట్‌లో ఆహారం తినే పాత్రలు కడుగుతున్నారు. ఓ వ్యక్తి ఈ ఘటనను గుర్తించి వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) స్పందించి ఐఆర్‌సీటీసీకి నోటీసు జారీ చేసింది (Indian Railways Catering Staff).
టాయిలెట్‌లో పాత్రలు కడగడం వల్ల ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని, ఇది అత్యంత అభ్యంతరకర చర్య అని సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది (FSSAI Notice). ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని, సంబంధిత క్యాటరింగ్ కాంట్రాక్టర్ వివరాలు, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా, ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని, సేవలందిస్తున్న సంస్థకు జరిమానా విధించామని ఐఆర్‌సీటీసీ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి..
బంగారం కొనాలనుకుంటున్నారా.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..