దిగ్బంధనాన్ని ఉల్లంఘించిన నౌక.. అమెరికా క్షిపణి దాడి..
ABN , Publish Date - May 31 , 2026 | 07:21 AM
ఇరాన్‌పై అమలు చేస్తున్న దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన ఓ కార్గో నౌకపై అమెరికా సైన్యం క్షిపణి దాడి చేసింది. గాంబియా జెండా కలిగిన ఆ కార్గో నౌక ఇరాన్ పోర్ట్ వైపు ప్రయాణిస్తుండగా, అమెరికా సైన్యం పలుసార్లు హెచ్చరికలు జారీ చేసింది.
ఇరాన్‌పై అమలు చేస్తున్న దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు ప్రయత్నించిన ఓ కార్గో నౌకపై అమెరికా సైన్యం క్షిపణి దాడి చేసింది. గాంబియా జెండా కలిగిన ఆ కార్గో నౌక ఇరాన్ పోర్ట్ వైపు ప్రయాణిస్తుండగా, అమెరికా సైన్యం పలుసార్లు హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ఆ నౌక సిబ్బంది స్పందించకపోవడంతో దాని ఇంజిన్ గదిని లక్ష్యంగా చేసుకుని హెల్‌ఫైర్ క్షిపణిని ప్రయోగించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది (US Aircraft Missile Strike).
మే 29న గల్ఫ్ ఆఫ్ ఒమన్ సమీపంలో ఈ ఘటన జరిగిందని, నౌక సిబ్బందికి 20కి పైగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ స్పందన రాలేదని సెంట్రల్ కమాండ్ (US Central Command) పేర్కొంది. దీంతో అమెరికా యుద్ధవిమానం నౌక ఇంజిన్ రూమ్‌పై దాడి చేసి దానిని నిలిపివేసిందని వెల్లడించింది. ఈ దాడిలో ఆ నౌక ఇంజిన్ తీవ్రంగా ధ్వంసమైనట్టు సమాచారం. ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా అనే విషయంపై అమెరికా సైన్యం ఎలాంటి సమాచారమూ వెల్లడించలేదు.
ఇరాన్-అమెరికా మధ్య ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది (Iran Blockade). అయినప్పటికీ ఇరాన్‌పై అమెరికా నౌకా దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది. ఈ దిగ్బంధనంలో భాగంగా ఇప్పటివరకు ఐదు వాణిజ్య నౌకలను నిలిపివేసి, 116 నౌకలను దారి మళ్లించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి..
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడి గుడ్లతో దాడి
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి.. ఖండించిన ఖర్గే