Share News

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక ఆధారాలు.. బయటపడ్డ పాకిస్థాన్ బ్యాంక్ లింకు..

ABN , Publish Date - Jun 01 , 2026 | 11:56 AM

గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తముందని నిరూపించే కీలక ఆధారాలు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి లభించినట్లు సమాచారం. దాడికి సంబంధించిన అనుమానితుల కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీల్లో పాకిస్థాన్‌ ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తోంది.

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక ఆధారాలు.. బయటపడ్డ పాకిస్థాన్ బ్యాంక్ లింకు..
Pahalgam Terror Attack

గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తముందని నిరూపించే కీలక ఆధారాలు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి లభించినట్లు సమాచారం. దాడికి సంబంధించిన అనుమానితుల కమ్యూనికేషన్, ఆర్థిక లావాదేవీల్లో పాకిస్థాన్‌ ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్టు తెలుస్తోంది. ఊగ్రమూకలు వాడిన ఫోన్లలో ఒక దానికి చెందిన కన్సైన్‌మెంట్ ఫైనాన్స్‌ను పాకిస్థాన్‌లోని ఫైసల్ బ్యాంక్ చేసినట్టు అధికారులు గుర్తించారు (Pahalgam Terror Attack).


దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ డేటా, కాల్ రికార్డులు, డిజిటల్ కమ్యూనికేషన్ వివరాలను విశ్లేషించగా.. పాకిస్థాన్‌కు చెందిన ఫైసల్ బ్యాంకు పేరు వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదుల నుంచి ఎన్‌ఐఏ షావోమీకి చెందిన 9టీ, నోట్ 12 ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వీటిలో ఒక ఫోన్‌ను కరాచీకి చెందిన టెక్ సిరత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2021లో దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. ఈ లావాదేవీకి ఫైసల్ బ్యాంక్ ఫైనాన్స్ చేసినట్టు అధికారులు గుర్తించారు (Pakistan Terror Funding).


గతంలో కూడా పలు ఉగ్రకార్యకలాపాల్లో ఫైసల్ బ్యాంకు పేరు వినిపించింది (Pahalgam Attack Probe). అయితే పహల్గాం దాడిలో మాత్రం ఈ బ్యాంక్ హస్తం నేరుగా ఉన్నట్టు బయటపడలేదు. ఈ ఫైసల్ బ్యాంకులో పాకిస్థాన్‌కు చెందిన రెండు ఉగ్రసంస్థలు తమ డిపాజిట్లను నిర్వహిస్తున్నాయని 2007లో ఒక అమెరికా పత్రిక వెలుగులోకి తెచ్చింది. కాగా, పహల్గాం ఉగ్రవాదులు వాడిన రెండు ఫోన్లను 2021, 2023ల్లో దిగుమతి చేసుకున్నారు. అయితే ఆ రెండు ఫోన్లను పహల్గాం ఉగ్రదాడి వరకు ఎక్కడా వాడలేదు. ఆ దాడిలో పాల్గొనే ఉగ్రవాదులకు అప్పగించాలనే కారణంతోనే ఆ ఫోన్లను స్విచ్ఛాప్ చేసి ఉంటారని ఎన్‌ఐఏ భావిస్తోంది.


ఇవి కూడా చదవండి..

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 11:59 AM