Share News

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు..

ABN , Publish Date - Jun 01 , 2026 | 10:46 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదటికి వచ్చాయి. శాంతి చర్చలు కొనసాగుతున్న దశలో ఇరు దేశాలు తాజాగా పరస్పర దాడులకు దిగాయి. ఇరాన్‌కు చెందిన రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కమాండ్ కంట్రోల్ కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు నిర్వహించింది.

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు..
US Iran Conflict

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదటికి వచ్చాయి. శాంతి చర్చలు కొనసాగుతున్న దశలో ఇరు దేశాలు తాజాగా పరస్పర దాడులకు దిగాయి. ఇరాన్‌కు చెందిన రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కమాండ్ కంట్రోల్ కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు నిర్వహించింది. దానికి ప్రతీకారంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అమెరికా సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది (US Iran Conflict).


అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న తమ ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేయడం, ఇతర దుందుడుకు చర్యలకు ప్రతిస్పందనగానే తాము దాడులకు దిగినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఇరాన్‌లోని గురుక్ నగరం, ఖేష్మ్ ద్వీపంలోని సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్టు తెలిపింది. తమ దాడిలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, గ్రౌండ్ స్టేషన్, రెండు అటాక్ డ్రోన్లు ధ్వంసమైనట్టు పేర్కొంది. పూర్తిగా ఆత్మరక్షణ కోసమే ఈ దాడులు చేసినట్టు వెల్లడించింది (Iranian Radar Sites).


తమ సైనిక కేంద్రాలపై దాడుల కోసం అమెరికా ఉపయోగించిన ఎయిర్‌బేస్‌ను తాము లక్ష్యంగా చేసుకున్నామని ఐఆర్‌జీసీ ప్రకటించింది (IRGC Attack). అమెరికా ఎయిర్‌బేస్‌పై ఐఆర్‌జీసీ ఏరోస్పేస్ ఫైటర్స్ దాడి చేశాయని వెల్లడించింది. అయితే ఏ దేశంలోని ఎయిర్‌బేస్‌పై దాడి జరిగిందో ఐఆర్‌జీసీ వెల్లడించలేదు. కాగా, ఇరాన్ ప్రయోగించిన కొన్ని క్షిపణులను కువైట్ ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకున్నట్టు కొన్ని గంటల క్రితం వార్తలు వచ్చాయి.


ఇవి కూడా చదవండి..

ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..


స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jun 01 , 2026 | 10:52 AM