ఆరంభ లాభాలు ఆవిరి.. ఒత్తిడిలో బ్యాంకింగ్ రంగం..
ABN , Publish Date - Jun 01 , 2026 | 10:22 AM
భారీ లాభాలతో మొదలైన దేశీయ సూచీలు ఆ తర్వాత క్రమంగా కిందకు దిగి వచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లబడడం, క్రూడాయిల్ ధరలు తగ్గడం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.81) బలపడడం వంటి కారణాలతో సూచీలు లాభాలతో మొదలయ్యాయి.
భారీ లాభాలతో మొదలైన దేశీయ సూచీలు ఆ తర్వాత క్రమంగా కిందకు దిగి వచ్చాయి. క్రూడాయిల్ ధరలు తగ్గడం, డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.81) బలపడడం వంటి కారణాలతో సూచీలు లాభాలతో మొదలయ్యాయి. అయితే గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగడంతో సూచీలు దిగి వచ్చాయి. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన దాడులు, బ్యాంకింగ్ రంగంలో అమ్మకాలు సూచీలను వెనక్కి లాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (74,775)తో పోల్చుకుంటే సోమవారం ఉదయం దాదాపు 500 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనైంది. ఆరంభ లాభాలను కోల్పోయింది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 28 పాయింట్ల లాభంతో 74,804 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే సాగుతోంది. ప్రస్తుతం 7 పాయింట్ల లాభంతో 23,555 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో పెర్సిస్టెంట్, ఇన్ఫోసిస్, ఎంఫసిస్, కోఫోర్జ్, ఎల్‌టీఎమ్ మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఐనాక్స్ విండ్, వెర్నోవా టీడీ, హిటాచీ ఎనర్జీ, సుజ్లాన్ ఎనర్జీ, ఇండియన్ రెన్యువబుల్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 549 పాయింట్ల నష్టంతో ఉంది.
ఇవి కూడా చదవండి..
ఆర్సీబీ ఫ్యాన్స్‌కు అన్యాయం.. ఐపీఎల్ ఫైనల్ వేదికపై డీకే శివకుమార్ ఆగ్రహం..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..