Share News

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - May 27 , 2026 | 06:35 AM

ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
gold and silver rates today

బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది (Gold and Silver Rates). ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.


గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, బుధవారం ఉదయం 6.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,58,880గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,45,640గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,59,030గా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,45,790గా ఉంది (Live Gold Rates).


మరోవైపు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి (Silver prices today). ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,94,900గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,84,900గా ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.2,94,900గా, బెంగళూరులో రూ.2,84,900గా ఉంది.

గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన.


ఇవి కూడా చదవండి..

ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..

మీ పెంపుడు జంతువుల మాటలను అర్థం చేసుకోవచ్చు.. చైనా కంపెనీ సంచలన ఆవిష్కరణ..

Updated Date - May 27 , 2026 | 07:35 AM