Share News

మీ పెంపుడు జంతువుల మాటలను అర్థం చేసుకోవచ్చు.. చైనా కంపెనీ సంచలన ఆవిష్కరణ..

ABN , Publish Date - May 26 , 2026 | 11:21 AM

ప్రస్తుత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎన్నో అద్భుతాలు మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. తాజాగా చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ మెంగ్ జోయ్ తాజాగా ఓ సంచలన ఆవిష్కరణ చేసింది.

మీ పెంపుడు జంతువుల మాటలను అర్థం చేసుకోవచ్చు.. చైనా కంపెనీ సంచలన ఆవిష్కరణ..
pet translation device

ప్రస్తుత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎన్నో అద్భుతాలు మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతున్నాయి. చైనాకు చెందిన స్టార్టప్ కంపెనీ మెంగ్ జోయ్ తాజాగా ఓ సంచలన ఆవిష్కరణ చేసింది. పెంపుడు జంతువుల శబ్దాలు, ప్రవర్తన, భావోద్వేగాలను మాటలుగా మార్చి మనుషులకు వినిపించగల ఓ సరికొత్త పరికరాన్ని ఆ సంస్థ తయారు చేసింది (AI pet translator).


ఏఐ సాంకేతికతతో పని చేసే ఆ పెట్ ట్రాన్స్‌లేటర్ 95 శాతం కచ్చితత్వంతో పని చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ పరికరం సహాయంతో పెంపుడు జంతువు ఏమి అనుభూతి చెందుతోందో, ఏమి చెబుతోందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీనిని కుక్క లేదా పిల్లి మెడకు అమర్చితే అది వాటి శబ్దాలను, శరీర కదలికలను, ప్రవర్తనను విశ్లేషించి 'ఇప్పుడు ఆకలిగా ఉంది', 'భయపడుతోంది', 'ఆడుకోవాలనుకుంటోంది' వంటి సందేశాలను యజమానికి తెలియజేస్తుంది (Pet translation device).


ఈ పరికరం ధరను 799 యువాన్లు (దాదాపు రూ.10 వేలు)గా నిర్ణయించారు (AI pet collar). మే 1వ తేదీ నుంచి ఈ పరికరానికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లను కంపెనీ ప్రారంభించింది. ఇప్పటివరకు పది వేలకు పైగా బుకింగ్స్ వచ్చినట్టు సంస్థ వెల్లడించింది. అయితే కంపెనీ ప్రకటనలపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ తన వాదనలను నిరూపించడానికి ఎలాంటి ఖచ్చితమైన డేటాను అందించలేదని అంటున్నారు.


ఇవి కూడా చదవండి..

ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి..


నష్టాలతో ప్రారంభమై కోలుకున్నాయి.. సూచీలకు స్వల్ప లాభాలు..

Updated Date - May 26 , 2026 | 11:34 AM