Share News

ఒకే రోజు 60 మందిని కరిచిన వీధి కుక్క.. భయం గుప్పిట్లో జనం

ABN , Publish Date - Jun 01 , 2026 | 01:02 PM

మధ్య ప్రదేశ్‌లోని శివ్‌పురి వీధుల్లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. ఒకే రోజు దాదాపు 60 మందిని విచక్షణా రహితంగా కరిచింది. వీధి కుక్క దాడిలో గాయపడ్డ వారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు.

ఒకే రోజు 60 మందిని కరిచిన వీధి కుక్క.. భయం గుప్పిట్లో జనం
Shivpuri stray dog attack

ఇంటర్‌నెట్ డెస్క్: మధ్య ప్రదేశ్‌లోని శివ్‌పురి వీధుల్లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. ఒకే రోజు దాదాపు 60 మందిని విచక్షణా రహితంగా కరిచింది. వీధి కుక్క దాడిలో గాయపడ్డ వారిలో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల మేరకు.. శివ్‌పురిలోని పలు వీధుల్లో ఓ నల్లకుక్క తిరుగుతోంది. రోడ్లపై కనిపించిన జనాలపై దాడికి దిగుతోంది. విచక్షణా రహితంగా కరిచేస్తోంది. రెండేళ్ల బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండగా నల్లకుక్క దాడి చేసింది. స్థానికులు కుక్కను తరిమికొట్టడంతో పెను ప్రమాదం తప్పింది.


ఆ నల్ల కుక్క దాడిలో గాయపడ్డ 60 మంది జిల్లా ఆస్పత్రి, లోకల్ హెల్త్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారని వైద్యాధికారులు తెలిపారు. వారందరికీ యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు. మనుషులపై దాడికి పాల్పడుతున్న కుక్కను పట్టుకోవడానికి శివ్‌పురి మున్సిపాలిటీ సిబ్బంది రంగంలోకి దిగారు. విజయవంతంగా కుక్కను పట్టుకున్నారు.


ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా వీధి కుక్క దాడి చేసినా.. వీధుల్లో అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. ఇక, వీధి కుక్కల బెడదపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిస్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ట్రాఫిక్‌లో చిక్కుకున్న కారు.. రోడ్డుపై ధర్నాకు దిగిన యువకుడు..

వర్షాభావంపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

Updated Date - Jun 01 , 2026 | 01:14 PM