Share News

వర్షాభావంపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:34 PM

వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌లో సమీక్ష జరిగింది. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం సూచించారు.

వర్షాభావంపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy

హైదరాబాద్, జూన్ 1: వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్‌లో సమీక్ష జరిగింది. నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్‌నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సీఎం సూచించారు. తక్కువ నీరు వినియోగించుకునే పంటలపై రైతులకు వివరించాలన్నారు. పంట మార్పిడి ప్రాధాన్యాన్ని అన్నదాతలకు తెలియజేయాలని సీఎం ఆదేశించారు.


ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై ఆరా

తెలంగాణలో ప్రాజెక్టుల మెయింటెనెన్స్ పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. గేట్లు, నిర్వహణ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల మెయింటెనెన్స్‌కు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న రూ.1000కోట్లను నిబంధనల ప్రకారం వినియోగించాలన్నారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం వాటిల్లినప్పుడు తక్షణమే అధికారులు స్పందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ, నీటి పారుదల, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్, ఆరోగ్య, హోమ్, హైడ్రా, విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత

అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. పెన్షన్ల పంపిణీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 01 , 2026 | 01:25 PM