సికింద్రాబాద్‌లో యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - Jun 01 , 2026 | 10:32 AM
సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. శ్రావణ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్ పరిధి మారేడుపల్లి పోలీస్ స్టేషన్ ప్రాంతంలో దారుణ హత్య జరిగింది. శ్రావణ్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన మద్యం మత్తులో జరిగిన ఘర్షణగా పోలీసులు చెప్పారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రావణ్ తన స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి మద్యం తాగాడు. అయితే నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ విషయంలో వారు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మరో యువకుడు కత్తితో శ్రావణ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన శ్రావణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
ఖమ్మం నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి తుమ్మల
Read Latest Telangana News And AP News And National News
And Telugu News