Share News

ఖమ్మం నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి తుమ్మల

ABN , Publish Date - May 31 , 2026 | 07:21 PM

రెండేళ్ల కిందట మున్నేరు వరదలకు తీవ్ర నష్టం చవిచూశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో రూ. 690 కోట్లతో ప్రోటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు.

ఖమ్మం నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి తుమ్మల
Minister Thummala Nageswara Rao

ఖమ్మం జిల్లా, మే 31 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల క్రితం మున్నేరు వరదలకు తీవ్ర నష్టం చవిచూశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకారంతో రూ. 690 కోట్లతో ప్రోటెక్షన్ వాల్ నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు. 240 మీటర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వెంటనే పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చామని అన్నారు. ఈరోజు (ఆదివారం) మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు.


ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడారు. జూలై లేదా ఆగస్టులో మున్నేరుకు వరద వస్తే ప్రజలకు నష్టం లేకుండా తక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్‌లోగా ఈ పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్త చర్యగా ఖమ్మం నగరానికి రెండు వైపులా వరద నీరు ప్రవేశించకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ పనుల ఆలస్యంపై ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు.గతంలో మున్నేరు పరిధిలో జరిగిన విధ్వంసం మళ్లీ జరగకుండా ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. క్రమశిక్షణ కమిటీ విచారణ

సీఎం.. జేబులో కత్తెర, రిబ్బన్‌తో తిరుగుతున్నారు.. కేటీఆర్ సెటైర్లు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - May 31 , 2026 | 07:42 PM