ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు..
ABN , Publish Date - Jun 01 , 2026 | 10:38 AM
నెల్లూరులో చైన్ స్నాచర్లు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు ముగ్గురు మహిళల మెడల్లో బంగారు గొలుసులను అపహరించడం తీవ్ర కలకలం రేపింది.
నెల్లూరు, జూన్ 1: నగరంలో చైన్ స్నాచర్లు బీభత్సం సృష్టించారు. ఒకే రోజు ముగ్గురు మహిళల మెడల్లో బంగారు గొలుసులను అపహరించడం తీవ్ర కలకలం రేపింది. జేమ్స్ గార్డెన్, పడరుపల్లి, చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతాల్లో దుండగులు బరితెగించారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా చోరీలు సాగాయి. మొత్తం 9 సవర్ల బంగారు గొలుసులు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు నవాబుపేట, వేదాయపాలెం, బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చోరీ జరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో దుండగులు చోరీకి పాల్పడటం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. చైన్ స్నాచర్లను వెంటనే పట్టుకోవాలని వారు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. పెన్షన్ల పంపిణీ
Read Latest AP News And Telugu News