Share News

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫేక్ వీసాతో ప్రయాణికుడి అరెస్ట్

ABN , Publish Date - Jun 01 , 2026 | 08:42 AM

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక ప్రయాణికుడిని నకిలీ వీసాతో పట్టుకున్నారు. కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడిని తనిఖీల సమయంలో అదుపులోకి అధికారులు తీసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఫేక్ వీసాతో ప్రయాణికుడి అరెస్ట్
Fake Visa Case

హైదరాబాద్‌, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఒక ప్రయాణికుడిని నకిలీ వీసాతో పట్టుకున్నారు. కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఓ ప్రయాణికుడిని తనిఖీల సమయంలో అదుపులోకి అధికారులు తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న వీసా డాక్యుమెంట్లు నకిలీవని గుర్తించారు. మున్ను స్వామి అనే వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ద్వారా కౌలాలంపూర్ వెళ్లేందుకు వచ్చాడు.


సాధారణ ప్రయాణికుల మాదిరిగానే చెక్-ఇన్, ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తున్న సమయంలో అధికారులు అతడి పాస్‌పోర్ట్, వీసా పత్రాలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో వీసా అనుమానాస్పదంగా ఉండటంతో మరింత సమగ్రంగా పరిశీలించారు. తదుపరి విచారణలో ఆ వీసా పూర్తిగా నకిలీదని స్పష్టమైంది. దీంతో వెంటనే ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఔట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం మున్నుస్వామి నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు.


ఈ వార్తలు కూడా చదవండి...

దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ విద్యా వ్యవస్థ ఉండాలనేదే మా లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

ఖమ్మం నగరాన్ని వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు: మంత్రి తుమ్మల

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jun 01 , 2026 | 08:59 AM