Share News

అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. పెన్షన్ల పంపిణీ

ABN , Publish Date - Jun 01 , 2026 | 10:17 AM

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన కొనసాగుతోంది. సత్యవరం గ్రామానికి చేరుకున్న హోం మంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.

అనకాపల్లి జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. పెన్షన్ల పంపిణీ
Home Minister Anitha

అనకాపల్లి జిల్లా, జూన్ 1: పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(సోమవారం) ఉదయం సత్యవరం గ్రామానికి చేరుకున్న హోం మంత్రికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. సత్యవరం గ్రామంలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అనిత పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. శ్రీరాంపురం గ్రామంలో బొడ్డపాటి వీరాస్వామి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు.


అనంతరం ఇటీవల కాలంలో అకాల వర్షాలకు మరణించిన అరట్లకోట గ్రామానికి చెందిన ఎరకయ్య, శంకర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి అనిత భరోసా ఇచ్చారు.


ఇవి కూడా చదవండి..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అయ్యన్నపాత్రుడు

ఐపీఎల్ చరిత్రలోనే వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2026 | 10:21 AM